జానకిగా ప్రేక్షకులు ముందుకి రానున్న టిల్లు గాడి లిల్లీ.. ఏ సినిమాతో అంటే..?!

టిల్లు స్క్వేర్‌తో హిట్ కొట్టి ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది అనుపమ పరమేశ్వరన్. అయితే తాజాగా మరో కొత్త సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమైంది. మలయాళ సినిమా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ పేరుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది అనుపమ. కోర్ట్ రూమ్ డ్రామాగా రుపొందుతున్న ఈ సినిమా ద్వారా దాదాపు రెండేళ్ల విరామం అనంతరం మలయాళం లో రియంట్రీ ఇవ్వ‌నుంది ఈ ముద్దుగుమ్మ.

టిల్లు స్క్వేర్ లో గ్లామరస్ పాత్రలో లిల్లీ గా అదరగొట్టిన అనుపమ.. ఇప్పుడు కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే ఓ పవర్ఫుల్ రోల్ లో ఆకట్టుకొనుంది. ఇందులో జానకిగా అనుపమ కనిపించనుంది. మలయాళ సీనియర్ నటుడు సురేష్ గోపి లాయర్ గా కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమాల తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి అంటూ అనుపమ దర్శకుడుతో ఉన్న ఫోటో తో సహా ఇన్స్టా వేదికగా షేర్ చేసుకుంది.

నా నెక్స్ట్ మూవీ డబ్బింగ్ పూర్తయింది అంటూ అందులో రాసింది. కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాడే మహిళగా జానకి.. ఆమె తరపున వాదించే లాయర్ గా సురేష్ గోపి నటిస్తున్నారు. ఇక సినిమాను మలయాళంతోపాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ప్రవీణ్ నారాయణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అలాగే ఈ సినిమాతో సురేష్ గోపి కుమారుడు మాధవన్ సురేష్ కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.