పుట్టినరోజు చనిపోయిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ను గుర్తుపట్టారా.. చావు వార్త ముందుగానే స్నేహితులతో చెప్పి షాక్ ఇచ్చిందిగా..?!

పుట్టిన ప్రతి ఒక్కరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో.. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అప్పుడే సంతోషంగా నవ్విన వ్యక్తి.. మరో నిమిషంలోనే తీవ్ర విషాదంలోకి మునిగిపోతూ ఉంటాడు. ఇక ఇటీవల మారుతున్న జీవనశైలితో అక్కడికక్కడే మనుషులు కుప్పకూలి పడిపోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో రోగాలు, వ్యాధులు అంటూ మనుషులు తీవ్ర అస్వస్థతలను ఎదుర్కొంటున్నారు. అయితే ఓ మనిషి పుట్టినరోజునే చనిపోయిన రోజు కూడా కావడం మరింత భాధ‌నుక‌లిగిస్తుంది. అయితే ఒక న‌టి అలాగే చనిపోయారు. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. బాలనాటి తరుణి సచ్ దేవ్‌. 15 సంవత్సరాల వయసులోనే విమాన ప్రమాదంలో మరణించింది. అప్పటికే ప్రకటనల్లో పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.

పా అనే సినిమాలో అమితాబ్ స్నేహితురాలిగా నటించి ఆకట్టుకున్న ఈ చిన్నది.. 14 మే 1998లో జన్మించింది. 14 మే 2012 నా విమాన ప్రమాదంలో ఈమె చనిపోయింది. ఈ తేదీ 14 తో పాటు ఇక్కడ గమ్మత్తు ఏంటంటే.. ఆమె మరణించే ముందే తన స్నేహితులతో ఆమె మాట్లాడిన మాటలు. ఆ మాటలు అందరికీ ఆశ్చర్యాన్ని కలుగజేశాయి. తరుణి తల్లితోపాటు వెకేషన్ కోసం నేపాల్ కు బయలుదేరుతూ.. స్నేహితులకు చెప్పిరావాలని వెళ్ళిందట. అయితే అక్కడ స్నేహితులని కలిసి కౌగిలించుకుని.. మిమ్మల్ని చివరిసారిగా కలుస్తున్న అంటూ ఆమె నవ్వుతూ చెప్పిందట. అప్పటివరకు ఆమె ఎప్పుడూ అలా ప్రవర్తించలేదట.. ఫ్లైట్ ఎక్కే ముందు కూడా తన స్నేహితుడికి అదేవిధంగా మెసేజ్ చేసింది.

అవును నేను ఎక్కే విమానం కూలిపోతే ఏం జరుగుతుంది.. అంటూ సరదాగా ఆమె స్నేహితుడికి మెసేజ్ చేసిందట. ఐ లవ్ యు అని ఆ మెసేజ్ లో రాసి ఉంది. దురదృష్టవశాత్తు ఆమెకు అదే చివరి ఫ్లైట్ జర్నీ. స్నేహితులను కలవడం చివరిసారి. ఈ చాటింగ్ స్నేహితుల‌తో మాట్లాడిన సంభాష‌ణ వింటే ఆమె చనిపోతున్నానని ముందుగానే హెచ్చరించినట్లు జరిగాయి. తరుణి.. తన తల్లి గీతా సచ్ దేవ్‌తో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న టైం లో ఆకస్మాత్తుగా విమాన ప్రమాదానికి గురై మరణించింది. అక్కడికక్కడే తల్లి కూడా ప్రాణాలు విడిచింది. ఇద్దరు ఒక్కసారిగా మరణించడంతో అప్పట్లో ఇండస్ట్రీ విషాదఛాయ‌లు నెలకొన్నాయి. కొన్నిసార్లు ఇలాంటి విషయాలు చూస్తే ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే అదే ఆమె పుట్టినరోజు కూడా కావడం మరింత బాధాకరం.