“నిద్రపోతున్న పులిని లేపారు కదరా..?”.. విజయ్ దేవరకొండ ఇష్యూ పై అనసూయ ఘాటు పోస్ట్ వైరల్..!

సోషల్ మీడియాలో .. అనసూయను కావాలని ట్రోలింగ్ కి గురి చేస్తూ ఉంటారు కొందరు ఆకతాయిలు . ఈ విషయం మనకు తెలిసిందే. తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ పై ఓ నెటిజన్ చాలా వైలెంట్ గా రియాక్ట్ అయ్యాడు . అతను పీఆర్ మించిన మాఫియా.. ఆయన ఇష్టం వచ్చింది మాట్లాడడం ..వెంటనే పీఆర్ మాఫియా తో తెలంగాణ హీరో మీద ద్వేషమని ..నా కారులో పెట్రోల్ లేదు బైక్ పై సైలెన్సర్ లేదు అని సానుభూతి డైలాగ్స్ కొట్టడం.. చివరికి అనసూయని కూడా ఇందులోకి లాగుతూ ఒక పోస్ట్ పెట్టాడు.

దీనిపై అనసూయ బోల్డ్ గా స్పందించింది. ” ఎవరు..? ఏం మాఫియా..? చేస్తున్నారు.. నేను ఎప్పుడో చెప్పి చెప్పి వదిలేసాను గా .. అనవసరంగా మళ్ళి ఎందుకు నన్ను లాగుతున్నారు .. నేను కూడా తెలంగాణ బిడ్డను.. నాకు సింపతి అక్కర్లేదు .. ఆ దేవుడి మీద నమ్మకం ఉంది .. మా అమ్మానాన్నలు నాకు ఇచ్చిన విలువలు పెంపకం ఎప్పుడు నన్ను దిగజార్చవు.. ఇప్పుడు వీటిని కూడా చాలామంది తమ స్వార్థానికి వాడుకుంటారు ..నాకు తెలుసు అయినా నాకు ప్రాబ్లం లేదు. అయినా నాకు తెలిసి మీరు నేను చుట్టాలము కాదు కదా.. సో ఎందుకు నన్ను ఆంటీ అని పిలుస్తున్నారు ..మీ ఇంట్లో అడగండి మీకు తెలియకుండా ఏమైనా రిలేషన్స్ ఉన్నాయేమో..? నాకైతే చుట్టాలు లేరు.. ఆ పలకరింపులు ఉంటే చుట్టాలుగా భావిస్తాం “అంటూ చాలా బోల్డ్ గా వైలెంట్ గా అనసూయ రిప్లై ఇచ్చింది . ప్రజెంట్ అనసూయ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

గతంలో అనసూయ విజయ్ దేవరకొండల మధ్య ఎలాంటి వార్ జరిగిందో మనకు తెలిసిందే. ఆ తర్వాత అవన్నీ సర్దుమణిగి పోయాయి. అయితే కొందరు కావాలని మళ్ళీ తెరపైకి ఆ వార్ ని తీసుకొస్తూ అనసూయని విజయ్ దేవరకొండను పరోక్షంగా చిక్కుల్లో ఇరుక్కునేలా చేస్తున్నారు అంటున్నారు జనాలు. “నిద్రపోతున్న పులి ని లేపారు కదరా..?” అంటూ అనసూయ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!