“నువ్వు లేకపోతే నేను లేను”.. అందరి మనసులని కదిలిస్తున్న విజయ్ దేవరకొండ న్యూ పోస్ట్..!

విజయ్ దేవరకొండ .. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోగా మారిపోయిన రౌడీ హీరో ..ఆటిట్యూడ్ హీరో ..హెడ్ వెయిట్ హీరో ..టాలెంటెడ్ హీరో ..నాటి హీరో ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే రకరకాల ట్యాగ్స్ తో విజయ్ దేవరకొండ అభిమానులు ఆయనను ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉంటారు . విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది .

ఫ్యామిలీ స్టార్ సినిమా చూసిన వారంతా విజయ్ లో ఈ టాలెంట్ కూడా ఉందా ..? అంటూ ఆశ్చర్యపోతు మెసేజెస్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు . “నా స్టార్ నువ్వే నా హీరో నువ్వే” అంటూ తన తండ్రిపై ఉన్న ప్రేమను తెలుపుతూ ఓ వీడియో షేర్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

“నా ఫ్యామిలీ స్టార్ నువ్వే నువ్వు లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడినే కాదు .. ఆ విషయం నీకు నాకు ఇద్దరికీ బాగా తెలుసు .. నేను బేబీగా అడుగులు వేస్తున్నప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి అడుగులోనూ నువ్వు నాతో కలిసే ఉన్నావు .. నన్ను గమనిస్తూనే ఉన్నావు.. నువ్వే నా హీరో నువ్వే.. నా బలం.. నేను నిన్ను ఎప్పుడైనా బాధపెట్టి ఉంటే నిరాశపరిచి ఉంటే నన్ను క్షమించు.. నేను మిమ్మల్ని గర్వపడేలా చేయడం నా అతి పెద్ద విజయం అవుతుంది. మీరు ఎప్పటికీ నా కుటుంబ స్టార్ గా ఉంటారు ” అంటూ రాసుకొచ్చాడు . దీంతో ఫాన్స్ విజయ్ దేవరకొండ పోస్ట్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు . విజయ్ దేవరకొండ ఇంత ఎమోషనల్ ఫెలోనా అంటూ ఆశ్చర్యపోతున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)