“ఇప్పుడే పెళ్లి అయ్యింది”.. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన మెగా మాజీ అల్లుడు..పోస్ట్ వైరల్..!

కళ్యాణ్ దేవ్ .. మెగా ఇంటికి మాజీ అల్లుడుగా మారి చాలా సంవత్సరాలు అవుతుంది . అయినా సరే ఇప్పటికీ ఈయనకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతుంది అంటే కారణం మాత్రం అది మెగా ఫ్యామిలీ అని చెప్పాలి . మనకు తెలిసిందే.. కళ్యాణ్ దేవ్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజను వివాహం చేసుకున్నారు . ఆ తర్వాత వీరిద్దరికి ఒక పాప కూడా పుట్టింది. చాలా హ్యాపీగా అన్యోన్యంగా సాగిపోతున్న వీళ్ళ లైఫ్ లో ఏం గొడవలు జరిగాయో ఏమో కానీ సడన్గా దూరం దూరంగా ఉండడం ప్రారంభించారు .

ఆ తర్వాత విడాకులు కూడా తీసుకున్నారు అంటూ ప్రచారం జరిగింది . ఇప్పటివరకు ఈ విషయాన్ని అఫీషియల్ గా అయితే బయట పెట్టలేదు . కానీ ఇన్సైడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళు విడాకులు తీసుకున్నారు అని వీళ్ళకి కోర్టు విడాకులు మంజూరు చేసిందని కూడా తెలుస్తుంది . అప్పటినుంచి కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన సరే జనాలు రేంజ్ లో ట్రెండ్ చేయడం లేదా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు .

అప్పుడప్పుడు తన కూతురు ఇంటికి తీసుకెళ్ళి సమయం గడుపుతూ ఆనందపడే కళ్యాణ్ దేవ్..రీసెంట్గా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా కళ్యాణ్ దేవ్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ గుడ్ న్యూస్ తెలిపాడు. ” ఇప్పుడే పెళ్లయింది” అనే క్యాప్షన్ పెట్టి ప్రశాంత్ – భావన చెరుకూరి పెళ్లి జరిగింది అని చెబుతూ వారితో ఉన్న ఫోటోలను షేర్ చేశారు . ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు బ్రో అని కొంతమంది అంటుంటే .. మరి కొంతమంది శ్రీజను వదిలేసి మంచి పని చేశావు అంటూ పొగిడేస్తున్నారు..!!