రష్మిక బర్త డే సర్ప్రైజ్: పుష్ప 2 న్యూ లుక్ చూశారా.. వేరే లెవల్.. కానీ అది మిస్సింగ్..!

ప్రజెంట్ కోట్లాదిమంది సినీ లవర్స్ ఎప్పుడెప్పుడు అంటూ ఆశగా ఈగర్ గా కళ్ళల్లో వత్తులు వేసుకొని వెయిట్ చేస్తున్న సినిమా పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తూ ఉండగా హీరోయిన్ పాత్రలో రష్మిక మందన్నా నటిస్తుంది . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు జనాలు . ఈ సినిమాకి సంబంధించిన చిన్న అప్డేట్ రిలీజ్ అయిన సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ చేస్తూ ఉంటారు అభిమానులు .

నేడు రష్మిక మందన్నా.. పుట్టినరోజు. ఈ క్రమంలోనే పుష్ప 2 టీం బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది . పుష్ప2 నుంచి రష్మిక మందన్నా నటిస్తున్న శ్రీవల్లి పాత్రకు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేసింది . గతంలో శ్రీవల్లి ఎంత డీ గ్లామరస్ పాత్రలో కనిపించిందో ఇప్పుడు శ్రీవల్లి అంత ట్రెడిషనల్ గా చాలా చక్కగా ఉండే లుక్ ను రిలీజ్ చేశారు. దీనితో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . ఈ పోస్టర్లో రష్మిక గ్రీన్ కలర్ పట్టు చీర కట్టుకొని నిండుగా నగలు పెట్టుకొని నిండు ముత్తయిదువుల కనిపిస్తూ కోపంగా కంటితో ఊరిమి చూస్తుంది .

ఈ పోస్టర్ చూసిన జనాలు రష్మిక లుక్స్ కు ఫిదా అయిపోయారు. కచ్చితంగా ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో రికార్డ్స్ బద్దలు కొడుతుంది అంటూ ఫిక్స్ అయిపోయారు. అంతేకాదు ఇప్పటివరకు రష్మిక మందన్నాను మనం ఇలాంటి లుక్ లో ఏ సినిమాలో కూడా చూడలేదు . ఫర్ ద ఫస్ట్ టైం కెరియర్ లో ఇంత గంభీరమైన లుక్ లో కనిపించబోతుంది. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన లుక్ ను బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు. మరెందుకు ఆలస్యం ఈ సినిమాలోని రష్మిక లుక్స్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి..!