ప్రెగ్నెంట్ అయిన సుజాత కడుపు విషయాని దాచడానికి కారణం అదేనా..? ఆ భయం ఇంకా వెంటాడుతుందా..?

రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రెటీస్ తమ ప్రేమ వ్యవహారాన్ని పెళ్లి వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా దాచేస్తున్నారు . మరి కొంతమంది అయితే గర్భం దాల్చిన విషయాన్ని కూడా చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి మనం చాలా చాలా ఎక్కువగా ఈ మధ్యకాలంలో వింటున్నాము. రీసెంట్ గా ఆది పినిశెట్టి – నిక్కి తల్లిదండ్రులు కాబోతున్నారు అన్న వార్త సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రెండ్ అయిందో మనం చూసాం . అయితే ఇప్పుడు రీసెంట్గా జబర్దస్త్ కామెడీయన్ శ్రీమంతపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

జోర్దార్ సుజాత ..ఈమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ప్రముఖ ఛానల్లో ఆమె పలు స్పెషల్ ప్రోగ్రామ్స్ తో కనిపించి అచ్చ తెలుగులో మాట్లాడి తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది . ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోకి ఎంట్రీ ఇచ్చి కమెడియన్ రాకింగ్ రాకేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఆ తర్వాత వెబ్ సిరీస్ లో కూడా నటించింది. రీసెంట్గా సుజాత రాకేష్ కు సంబంధించిన కొన్ని పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . సుజాత ప్రెగ్నెంట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

ఆమె శ్రీమంతం రీసెంట్ గానే ఘనంగా జరిగినట్లు ఆ ఫోటోలు ఆధారంగా తెలుస్తుంది . పట్టుచీర కట్టుకొని ఒంటినిండా నగలు పెట్టుకొని సుజాత చాలా చక్కగా కనిపించింది . దీంతో అందరూ షాక్ అయిపోతున్నారు . సుజాత ఎందుకు తన ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచింది అంటూ ఆరాతీస్తున్నారు . అయితే గతంలో జబర్దస్త్ కమెడియన్ తన భార్య ప్రెగ్నెంట్ అని చెప్తూ కొన్ని ఫొటోస్ రిలీజ్ చేయగా ఆ తర్వాత వాళ్ళు తమ బిడ్డను కోల్పోయారు. దిష్టి తగలడం కారణంగానే ఈ విధంగా జరిగింది అంటూ చాలామంది మాట్లాడుకున్నారు . ఆ భయం కారణంగా కావచ్చు సుజాత తన ప్రేగ్నెన్సీ విషయాన్ని దాచింది అంటున్నారు ఆమె అభిమానులు, కొందరు నీకు సేఫ్ గా డెలివరీ అవ్వాలి నీలాంటి చక్కటి పాప పుట్టాలి అంటూ బ్లెస్ చేస్తున్నారు..!!