కత్తి లాంటి హీరోని పట్టేసిన సంయుక్తా మీనన్..త్వరలోనే గుడ్ న్యూస్..!?

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే సరిపోదు .. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సినిమాలు చూస్ చేసుకోవాలి..? ఎలాంటి హీరోస్తో మూవీస్ ను ఓకే చేసుకోవాలి..? అలా చేసిన తర్వాత ఎవరికి ప్లస్ ఎక్కువగా అవుతుంది..? అనే విషయాలపై ముందుగానే ఆలోచించే స్టామినా ఉండాలి. అలాంటి స్టామినా ఉన్న హీరోయిన్స్ మన ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి . పెద్ద హీరో సినిమానా కమిట్ అయిపోదాం ..రెమ్యూనరేషన్ బాగా ఇస్తారు .. క్రేజ్ పాటికి క్రేజ్ వస్తుంది .

ఈ విధంగా ఆలోచిస్తారు తప్పిస్తే వన్స్ ఆ సినిమా ఫ్లాప్ అయితే వచ్చే పాపులారిటీ కన్నా డబల్ రేంజ్ లో డిజాస్టర్ టాక్ అందుకోక తప్పదు అనే విషయాన్ని మాత్రం మర్చిపోతూ ఉంటారు . అయితే ఆ విషయంలో హీరోయిన్ సంయుక్త మీనన్ టూ టాలెంటెడ్ అని చెప్పాలి. సంయుక్త మీనన్ తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలే కానీ చేసిన ప్రతి సినిమాలో తన పర్ఫామెన్స్ ను హైలెట్ గా మార్చుకున్నింది.

మరి ముఖ్యంగా సంయుక్త చూస్ చేసుకునే హీరోలు కూడా చాలా వెరైటీగా ఉంటారు. సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా ఆ హీరోకి పాజిటివ్ కామెంట్స్ దక్కే విధంగా ఉండే హీరోస్ నే తన సినిమాలో చూస్ చేసుకుంటుంది . పవన్ కళ్యాణ్ – రానా – కళ్యాణ్ రామ్ – సాయి ధరంతేజ్ లాంటి హీరోల సినిమాలలో ఇప్పటివరకు నటించింది. రీసెంట్గా హీరో శర్వానంద్ తో ఒక క్రేజీ ప్రాజెక్టుకు కమిట్ అయింది సంయుక్త అంటూ ప్రచారం జరుగుతుంది .

అబ్బ రాజు దర్శకత్వంలో శర్వానంద్ ఒక సినిమా చేస్తున్నాడు . ఈ సినిమాలో మొదటి హీరోయిన్గా సంయుక్త మీనన్ సెలెక్ట్ అయిందట ..రెండవ హీరోయిన్గా సాక్షి వైద్య సెలెక్ట్ అయిందట .. దీంతో మరొక కత్తిలాంటి హీరోని పట్టేసింది . సంయుక్త సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన ఆ పాత్రకు మాత్రం పాజిటివ్ కామెంట్స్ కచ్చితంగా దక్కుతాయి అంటూ ఓ రేంజ్ లో ఆమె తెలివితేటలను పొగిడేస్తున్నారు..!