బీచ్ ఒడ్డున స‌న్ సెట్ ఎంజాయ్ చేస్తున్న ఈ క్రేజి బ్యూటీని గుర్తుప‌ట్టారా..?!

ప్రతి ఏడాది ఇండస్ట్రీలో నటినటులు కావాలని ఎంతోమంది అడుగుపెడుతూ ఉంటారు. అయితే ఈ సినిమాలో తమకంటు ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడం కోసం అహర్నిశ‌లు శ్రమిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వచ్చిన కొందరు నటీనటులు వెంటనే అవకాశాన్ని అందుకుని.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్స్ గా మారిపోతూ ఉంటారు. అలా ప్రస్తుతం ఈ పై ఫోటోలో సన్ సెట్ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్న అమ్మడు ఓ సినిమాలో అవకాశాన్ని అందుకుని తన నటనతో సత్తా చాటుకుంది. దీంతో పలు సినిమాల్లో అవకాశాలు అందుకుని టాలీవుడ్లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో అడుగుపెట్టడానికి సిద్ధమౌతుంది. అయితే ఒకప్పుడు ఈమె అందం గురించి ఎగతాళి చేసిన వాళ్ళే ఇప్పుడు ఆమెను చూసి ఫీదా అవుతున్నారు.

300+ Divya Bharti Photos: Find Latest HD Images, Pictures, Stills & Pics -  Filmibeat

ఆమె క్రేజ్ చూసి నోరెళ‌బెడుతున్నారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు.. తెలుగులో ఆమె నటిస్తున్న సినిమా ఏంటి ఒకసారి చూద్దాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటించాలని చాలామంది నటీనటులు భావిస్తూ ఉంటారు. అందుకే మిగతా పరిశ్రమల్లో కంటే తెలుగులోనే ఎక్కువగా నటీనటులు సినీ అవకాశాన్ని కూడా వదులుకోరు. అలా తాజాగా దివ్యభారతి అనే హీరోయిన్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. వాస్తవానికి దివ్యభారతి తెలుగులో కనిపించడం ఇదే మొదటిసారి కాదు. కానీ నేరుగా హీరోయిన్గా నటిస్తున్న తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న గోట్ మూవీ తో ఈ అమ్మ‌డు హీరోయిన్గా పరిచయం కానుంది.

Divya bharati, tamil actress, HD phone wallpaper | Peakpx

ఈ నేపథ్యంలో దివ్యభారతి గురించి ఓ ఆసక్తికరమైన విషయం నెట్టింట వైరల్ అవుతుంది. 2015లో మోడలింగ్‌లో అడుగుపెట్టిన ఈ అమ్మడు అంతకంటే ముందే కళాశాలలో చదువుకునే రోజుల్లో అందం గురించి అందరూ ఎగతాళిగా మాట్లాడార‌ని.. తనపై జోకులు వేస్తూ ఉండే వారిని దీంతో ఆమె చాలా డిప్ర‌ష‌న్‌ అనుభవించానని చెప్పుకొచ్చింది. ఇటీవల పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆమె ఈ విష‌యం వివరించింది. తమిళ్‌లో బ్యాచిలర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వఈ చిన్న‌ది తర్వాత మదిల్ మోల్ కాదల్, కింగ్ స్టన్, మహారాజా లాంటి సినిమాల్లో కనిపించి మెప్పించింది. ఇందులో మహారాజ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. ప్రస్తుతం దివ్యభారతి హాట్ లుక్స్ చూసిన వారంతా ఆమెకు ఫిదా అవుతున్నారు. అయితే కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకుంటున్న దివ్యభారతి తెలుగులో ఎలాంటి సక్సెస్ ని చూస్తుందో వేచి చూడాలి.