ప‌వ‌న్ అభిమానులు లేకుంటే.. చిరు సినిమాలు ఆడ‌వు.. ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్‌..?!

మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలతో హిట్ అందుకుని ప‌ద్మ‌ విభుషణ్, పద్మ విభ‌ష‌ణ్‌ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకున్న చిరంజీవి సినిమాకు టాక్ పాజిటివ్‌గా వస్తే ఏ రేంజ్ లో కలెక్షన్లు కురిపిస్తుందో అందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ లేకపోతే చిరంజీవి సినిమాలు ఓపెనింగ్స్ కూడా ఉండవు అంటూ తాజాగా గ్రంధి శ్రీనివాస్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ చిరంజీవి టికెట్ రేట్లు పెంపు కోసం జగన్ ను కలిసారని.. దీంతో పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కు చిరంజీవి సినిమాలు చూడవద్దని చెప్పారంటూ వివరించాడు.

Actor Chiranjeevi Donates Rs 5 Crore to Jana Sena

అప్పటినుంచి మెగాస్టార్ సినిమాలకు మినిమం ఓపెనింగ్ కూడా రాలేదని.. ఆయన చెప్పుకొచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి పక్క కమర్షియల్ మనిషి అని.. పవన్ యాక్సెస్ కోసమే చిరంజీవి ఆయ‌న‌కు రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారని.. అంతకుమించి మంచి ఉద్దేశం ఏమీ లేదంటూ శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జనసేనకు చిరంజీవి ఎలక్షన్ ఫండ్ ఇచ్చారని.. విశ్వంభరా సినిమాకు పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ చాలా అవసరం కనుక ఈ విధంగా ఆయన చేశాడంటూ గ్రంధి శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Vishwambhara - Wikipedia

ప్ర‌స్తుతం ఈ న్యూస్ వైర‌ల్ అవ్వ‌డంతో చిరంజీవి స్థాయిని తగ్గించే విధంగా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ మండిపడుతున్నారు. చిరంజీవి బ్యాక్ డ్రాప్ తోనే పవన్ అడుగు పెట్టారని.. చిరంజీవి స్టార్ హీరోగా అవ్వడంతోనే పవన్ సినిమాలను అభిమానులు చూడడం మొదలుపెట్టారని.. అలాంటి మెగాస్టార్ గురించి ఇలా మాట్లాడడం సరైన పద్ధతి కాదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్ విశ్వంభరా సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంటుందని.. కలెక్షలపరంగా రికార్డులు సృష్టిస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.