రామ్ చరణ్ కి సినిమాలు చేయడం కన్నా అలాంటి వర్క్ చేస్తేనే ఇష్టమా..? మెగా బ్లడ్ అనిపించాడుగా..!

గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాక .. రామ్ చరణ్ పేరు ఎలా మారుమ్రోగిపోతుందో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన రేంజ్ ఓ రేంజ్ లో మారిపోయింది . ఇప్పుడు ఆయనకు సంబంధించిన ప్రతి ఇది కూడా గ్లోబల్ స్థాయిలో నే ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గానే గేమ్ చేంజర్ అనే సినిమా షూట్ ను కంప్లీట్ చేసుకున్న రాంచరణ్ ఇప్పుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . ఈ సినిమా కోసం చాలా కష్టపడడానికి ముందు నుంచి తన బాడీని ప్రిపేర్ చేసుకుంటున్నాడు రామ్ చరణ్ .

కాగా రీసెంట్గా రాంచరణ్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ కి సినిమాలో చేయడం కన్నా కూడా బిజినెస్ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉందట . నిజానికి రాంచరణ్ ఏనాడు కూడా హీరో అవ్వాలి అని అనుకోలేదట . బిజినెస్ రంగంలోకి దిగి అటువైపుగా సెటిల్ అవ్వాలనుకున్నారట . కానీ యంగ్ ఏజ్ లో స్టార్ హీరోస్ కి వచ్చే క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పబ్లిసిటీ చూసి తాను హీరో అవ్వాలి అంటూ డిసైడ్ అయ్యారట .

చరణ్ చదువుకునే టైంలో కూడా బిజినెస్ రంగంలోనే దిగాలి అని బాగా బాగా ఫిక్స్ అయిపోయాడట. నాన్న – బాబాయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూశాక ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా రావాలి అని డిసైడ్ అయ్యాడట చరణ్ అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు రామ్ చరణ్ అంటే ఇప్పుడు జనాలు ఓ రేంజ్ లో లైక్ చేసేస్తున్నారు. పక్కాగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ – చిరంజీవి కన్నా కూడా కూసింత రేంజ్ లో రాంచరణ్ ఫాలోయింగ్ ఎక్కువ..!!