వామ్మో .. ఒక్క‌పారిగా రూ.30 కోట్లు పెంచేసిన చ‌ర‌ణ్‌.. టోట‌ల్ రెమ్య‌న‌రేష‌న్ తెలిస్తే షాక్ అవుతారు..?!

రాజమౌళి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో రాంచరణ్ గ్లోబల్ సార్ గా మారిపోయారు. అయితే ఈ సినిమా తర్వాత నుంచి చరణ్ గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. తాజాగా చరణ్‌కు సంబంధించిన ఓ ఆశ‌క్తికర విషయం నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు డైరెక్షన్లో సుమన్ తెర‌కెక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాగా ఆర్‌సి 16 వర్కింగ్ టైటిల్ తో చేస్తున్న ఈ సినిమా జూన్ నెలాఖరి నుంచి షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ సినిమా నిమిత్తం రామ్ చరణ్ తీసుకోబోయే రెమ్యూనరేషన్ ప్రస్తుతం నెట్టింటి వైరల్ గా మారింది.

Game Changer (film) - Wikipedia

గేమ్ చేంజెర్‌ సినిమా కన్నా 30 కోట్లను పెంచేసి మరి ఆర్సి16 కోసం రామ్ చరణ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. అసలు గేమ్ చేంజర్‌ సినిమాకు ఎంత తీసుకుంటున్నారు.. బుచ్చిబాబు సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో ఒకసారి చూద్దాం. ఆర్ఆర్ఆర్‌ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. సినిమాతో గ్లోబల్ స్టార్ గా బిరుదు అందుకున్న చరణ్ ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్‌వేదక‌ల‌పై చీఫ్ గెస్ట్ గా హాజరు కావడం.. పురస్కారాలు అందుకోవడం చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. కాగా రామ్ చరణ్ ఆర్‌ఆర్ఆర్ తర్వాత గేమ్ చేంజర్ సినిమాకు ఏకంగా రూ.95 కోట్ల వరకు రమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం కియారా అద్వానీ హీరోయిన్గా శంకర్ డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న గేమ్‌చేంజ‌ర్‌ సినిమాలో నటిస్తున్న చరణ్ దీంతోపాటే.. ఆర్సి 16 సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ క్రమంలో చరణ్ రెమ్య‌న‌రేష‌న్‌ హాట్ టాపిక్ గా మారింది. చరణ్ ఒక్కసారిగా భారీగా రెమ్యూనరేషన్ పెంచాడ‌ని.. అయితే మైత్రి మూవీ వారు స్వయంగా ఎక్కువ రమ్యునరేషన్ ఇచ్చేందుకు యాక్సెప్ట్ చేశారని.. ఈ లెక్క ప్రకారం బుచ్చిబాబుతో చేసే సినిమాకు రూ.125 కోట్ల నుంచి రూ.130 కోట్ల వరకు తీసుకుంటున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు.