ఓ మై గాడ్: అనసూయ అలాంటి నిర్ణయం తీసుకుందా..? ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను వదిలేయబోతుందా..?

అనసూయ.. ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో సోషల్ మీడియాలో దూసుకుపోతున్న పేరు . అంతేకాదు అనసూయ గురించి ఏదో ఒక వార్త నిరంతరం సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతూనే ఉంటుంది. కొంతమంది అనసూయ ను పాజిటివ్ గా ట్రెండ్ చేస్తూ ఉంటే మరికొంతమంది అనసూయను దారుణంగా ట్రోల్ చేస్తూ ఉంటారు . ఆమె మంచి చేసిన సరే అది చెడుగా చిత్రీకరిస్తూ ఉంటారు. ప్రజెంట్ అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

సినిమా ఇండస్ట్రీలో పలు కీలకపాత్రలో నటిస్తూ మెప్పిస్తూ వస్తున్న అనసూయ ప్రజెంట్ పుష్ప2 సినిమాలో కూడా నటిస్తుంది. రీసెంట్గా అనసూయ అభిమానులతో చిట్ చాట్ చేసింది . ఈ క్రమంలోనే తన వెకేషన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఫ్యాన్స్ తో చర్చించింది . ఈ క్రమంలోనే ఓ అభిమాని నుంచి సోలో ట్రిప్ వెకేషన్ సజెషన్ అందుకున్న అనసూయ చాలా ఓపెన్గా ఆన్సర్ ఇచ్చింది .

:నిజానికి ఈ థాట్ ఒకప్పుడు పిచ్చ భయం వేసేది.. ఒక్కదాన్నే ఎక్కడికైనా వెళ్లాలి అంటే భయం. కానీ ఇప్పుడు ఆలోచిస్తా “అంటూ సో ట్రిప్ కోసం ఏదైనా సజెషన్స్ ఇవ్వమంటూ కోరింది . అయితే మీరు ఎక్కడుంటే అక్కడ సంబరమే మేడం అంటూ మరో ఫ్యాన్ కామెంట్ చేయగా “సో స్వీట్ అఫ్ యు” అంటూ మురిసిపోయింది అనసూయ . ఇందులో పెద్దగా బూతు అర్థం లేదు .. అలాగే తప్పు పట్టాల్సిన ఛాన్స్ లేదు . కానీ కొంతమంది కావాలని అనసూయ పేరును ట్రోల్ చేస్తున్నారు . ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను వదిలేసి సోలో ట్రిప్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నావా..? నీకు ఇది న్యాయమేనా..? అంటూ తలా తోక లేని లాజిక్ తో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి ట్రోలింగ్ అనసూయ కి కొత్త ఏం కాదు గతంలో చాలా చాలా విషయాలలో ఇలాంటి ట్రోలింగ్ ఎదుర్కొంది . అయితే ఒకప్పుడు అనసూయ ఇలాంటి వాటిపై ఇచ్చి పడేసేది . ఇప్పుడు మాత్రం సైలెంట్ గా అయిపోయింది అంటున్నారు అభిమానులు..!!