ప్రభాస్ ని ఎత్తుకునే ముందు అనుష్క ఆ డ్రింక్ తాగిందా..? అందుకే అంత బలం వచ్చిందా..?

సాధారణంగా మనం సినిమాలో హీరోయిన్స్ ని హీరోలు ఎత్తుకోవడమే గమనిస్తూ ఉంటాం. రొమాంటిక్ సీన్స్ లో పలు సందర్భాలలో హీరోయిన్స్ ని అవలీలగా ఎత్తేస్తూ ఉంటారు హీరోలు. అయితే వాటికి భిన్నంగా ఫర్ ద ఫస్ట్ టైం కొరటాల శివ ఒక హీరోయిన్ చేత ఒక హీరోని ఎత్తుకునేలా చేస్తాడు. ఆ సినిమా మరేదో కాదు మిర్చి . కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అనుష్క హీరోయిన్గా నటించిన సినిమా మిర్చి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది .

అంతేకాదు ప్రభాస్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గారు ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ గురించి మనందరికీ తెలిసిందే . ఇప్పటికి ప్రభాస్ కెరియర్ లో ఈ సినిమా జనాలకి వన్ ఆఫ్ ది టాప్ టెన్ మూవీగా నిలిచిపోయే విధంగా నచ్చుతుంది . ఈ సినిమాలో హీరోయిన్ అనుష్క ఒకానొక సీన్ లో హీరో ప్రభాస్ను ఎత్తుకుంటుంది . ఆరడుగుల కటౌట్ ఉన్న ప్రభాస్ ని ఎత్తుకోవడం అంటే మాటలా ..? అయితే హీరోయిన్ అనుష్క ఎలా ఎత్తుకుంది..? ఇదంతా గ్రాఫిక్స్ ఏమో..? అంటూ అప్పట్లో చర్చించుకున్నారు జనాలు .

అయితే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ – అనుష్క దీనికి క్లారిటీ ఇచ్చారు. అది ఏ గ్రాఫిక్స్ కాదు అని .. నిజంగానే అనుష్క ఎత్తుకుంది అని.. ప్రభాస్ చెప్పుకొచ్చాడు . మొదట స్టూల్ మీద నిల్చున్నాను అని.. ఆ తర్వాత ఆమె నా కాళ్ళను గట్టిగా పట్టేసుకుంది అని .. ఆ తర్వాత ప్రొడక్షన్ వాళ్ళు స్టూల్ తీసేసారని .. అప్పుడే ఆమె నన్ను లిఫ్ట్ చేసింది అని ..ఎక్కడ పడేస్తుందో బాబోయ్ అంటూ భయపడ్డాను అని చెప్పుకొచ్చాడు . అయితే అనుష్కకు అంత బలం ఉందా..? అంటే మాత్రం ఆ సీన్ చేసే ముందు ఆమె చేత స్పెషల్ మిల్క్ షేక్స్ తాపించారట కొరటాల శివ .. అందుకే అంత బలంగా గట్టిగా మోయగలిగింది అంటున్నారు జనాలు..!