“రాసిపెట్టుకోండి..ఆ కొత్త జంట విడిపోబోతుంది”.. మరో బిగ్ బాంబ్ పేల్చిన వేణు స్వామీ..!!

వేణు స్వామి .. ఈయన చెప్పేది అన్నీ అబద్ధాలు అని చెప్పడానికి లేదు.. పోనీ ఈయన చెప్పేది అన్నీ నిజాలు అని చెప్పడానికి లేదు . వేణు స్వామి చెప్పినది కొన్ని జరుగుతున్నాయి .. కొన్ని జరగకుండా ఆగిపోతున్నాయి . అయితే ఎప్పటికైనా అది జరగొచ్చు అంటున్నాడు వేణు స్వామి . ఈ మధ్యకాలంలో బాగా కాంట్రవర్షియల్ విషయాలను బయటపెడుతూ వస్తున్న వేణు స్వామి తాజాగా రీసెంట్గా పెళ్లి చేసుకున్న ఓ జంట గురించి బిగ్ బాంబ్ పేల్చాడు .

వాళ్లు తమ వద్దకు వచ్చి జాతకం చూయించుకున్నారు అని అబ్బాయికి నాగదోషం.. అమ్మాయికి కుజదోషం ఉంది అని చెప్పాను అని .. వాళ్ళిద్దరి జాతకాలు మ్యాచ్ అవ్వవు చేసుకుంటే విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని కూడా చెప్పాను అని.. కానీ ఐదేళ్లు ప్రేమించుకున్న ఈ జంట ఫైనల్లీ పెళ్లి చేసుకున్నారు అని కానీ రాసి పెట్టుకోండి వాళ్లు త్వరలోనే విడిపోబోతున్నారు .. వాళ్ళ జాతక చక్రాలు బాగాలేవు .. వాళ్లు కలిసి ఉండే ఛాన్సెస్ అస్సలు లేవు అంటూ సంచలన కామెంట్స్ చేశారు .

దీనితో సోషల్ మీడియాలో వేణు స్వామి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి . అయితే గతంలోనూ నాగచైతన్య సమంత విషయంలో వేణు స్వామి చెప్పినట్లే జరిగింది . బహుశా ఈ కొత్త జంట విషయంలో కూడా అదే జరగబోతుందా..? అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా బాగా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో వేణు స్వామి పేరు మరోసారి ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది..!!