ఆ బాధల నుంచి తప్పించుకోవడానికి నమ్రత అలా చేస్తుందా..? ముంబై తెలివితేటలు మామూలుగా లేవుగా..!

నమ్రత శిరోద్కర్ .. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు. బాలీవుడ్ బ్యూటీ అందాల ముద్దుగుమ్మ ఇండస్ట్రీని తన అంద చందాలతో ఏలేసిన స్టార్ హీరోయిన్ . ఇదంతా ఒకప్పటి మ్యాటర్.. ఇప్పుడు ఓ ట్రెడిషనల్ బ్యూటీ . ఇద్దరు పిల్లలకు తల్లిగా మహేష్ బాబు భార్యగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ తన భర్త బిజినెస్ లను తన కూతురు కొడుకు చదువు విషయాలను దగ్గరుండి చూసుకుంటుంది .

అందుకే మహేష్ బాబు భార్య నమ్రత అంటే అభిమానులకి అంత ఇష్టం . అయితే సాధారణంగా స్టార్ హీరోయిన్ అయినా సరే పెళ్లి చేసుకున్నాక అన్నిటికీ దూరంగా ఉండాలి అంటే అది కష్టమైన మేటర్ . నమ్రత లాంటి ఓ స్టార్ హీరోయిన్ అలా చేయడం అప్పట్లో సంచలనంగా మారింది . అయితే నమ్రత కి ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి బాగా తెలుసు అని .. ఒక స్టార్ హీరో భార్య అయిన తర్వాత ఇండస్ట్రీలో ఆమెకు ఎలాంటి పాత్రలు ఇస్తారు ..?

ఇచ్చిన తర్వాత కొన్నాళ్లకు ఎలాగో ఫేడ్ అవుట్ అయిపోతాము.. ఆ తర్వాత ఎటువంటి ట్రోలింగ్ జరుగుతుంది అన్న విషయాల గురించి ముందుగానే ఆలోచించిన నమ్రత.. అసలు సినిమాలకే దూరంగా వెళ్లిపోవడం బెటర్ అంటూ ఇలాంటి నిర్ణయం తీసుకుందట . దీంతో ముంబై తెలివితేటలు బాగానే పట్టాయి నమ్రతకు అంటూ పలువురు ట్రోల్ చేసిన ఆ విషయాలను పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చూసుకో పోతుంది నమ్రత శిరోద్కర్..!!