వాట్.. ల‌క్కీ బ్యూటీ అదితి శంక‌ర్ రెమ్యున‌రేష‌న్ మ‌రీ అంత త‌క్కువా.. అస‌లు న‌మ్మ‌లేరు..!!

ఏ ఇండస్ట్రీలో అయినా స‌క్స‌స్‌లు వ‌స్తేనే ముందుకు సాగాలంటే ప్రతిభా, శ్రమతో పాటు అదృష్టం కూడా దానికి తోడవ్వాలి. అల సినీ ఇండస్ట్రీలో కూడా ఒకసారి హీరో, హీరోయిన్లు నటించిన సినిమాలు సక్సెస్ సాధించిన.. తదుపరి సినిమాల్లో అవకాశాలు రావడం కష్టంగానే ఉంటుంది. అయితే నటి అదితి శంకర్ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని చెప్పాలి. ప్రముఖ దర్శకుడు శంకర్.. ఇద్దరు కూతుర్లలో చిన్న కూతురు అదితి శంకర్ వైద్య విద్యను పూర్తి చేసింది. అయితే ఈమె నటన రంగంపై ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

Viruman: The release date of the Karthi-Aditi Shankar starrer is here,  details inside

2022లో కార్తీకి జంటగా వీరూమన్‌ సినిమాలో నటించింది అదితి. ఈ సినిమాతో సింగర్‌గాను పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె పాడిన పాట మంచి సక్సెస్ అందుకుంది దీంతో అదితి శంకర్‌కు వరుస అవకాశాలు క్యూక‌ట్టాయి. దీంతో ఈమె శివ కార్తికేయన్ నటించిన మావిరన్‌లో మరోసారి నటించింది. సినిమా మంచి వసూళ్లను సాధించడంతో కోలీవుడ్ లక్కీ హీరోయిన్గా క్రేజ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం విష్ణువర్ధన్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఓ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న అదితి దివంగత నటుడు మురళి రెండో కొడుకు నటుడు.. అధర్వ తమ్ముడు ఆకాష్‌మురళితో జతకట్టనుంది.

Sivakarthikeyan and Aditi Shankar's chemistry is fresh & adorable in the  new 'Maaveeran' song! - Tamil News - IndiaGlitz.com

ఆకాష్ మురళి తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా ఇంకా సెట్ పైనే ఉండగానే నటుడు సూర్య సరసన జతకట్టే అవకాశాన్ని అదితి అందుకుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యాక్టర్ సూర్య ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న.. సుధా కొంగర డైరెక్షన్లో తెర‌కెక్కుతున్న సినిమాలో ఈమెకు అవకాశం వచ్చిందట. అలాగే నటుడు అధర్వ సరస్సన కూడా అదితి శంకర్ నటించనున్నారని తెలుస్తోంది. ఇలా రెండేళ్లలో ఈమె నటించిన రెండు సినిమాలు సక్సెస్ అవ్వడంతో.. మరో మూడు సినిమాల్లో అవకాశాలు అందాయి.

Murali Shankar: Latest News, Videos and Photos of Murali Shankar | Times of  India

అయితే క్రేజీ బ్యూటీగా వరుస సక్సెస్‌లు అందుకుంటున్న అదితి శంకర్.. రెమ్యునరేషన్ విషయానికి వస్తే మాత్రం ఒక్కో సినిమాకి కేవలం రూ.25 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇక ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు విజయం సాధిస్తే ఈమె కోటికి పారితోష‌కం పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇదంతా స‌క్స‌స్‌ల‌పై ఆధారపడి ఉంది. ఇక అదితి శంకర్ ఇప్పటికే రూ.80 లక్షల వరకు కూడా పెట్టిందట. ఇకపోతే ఈమె తండ్రి దర్శకుడు శంకర్ ఆస్తి రూ.250 కోట్లకు పైగా ఉంటుంద‌ని టాక్‌.