కొరటాల – ఎన్టీఆర్ మూవీకి “దేవర” అనే టైటిల్ ని సజెస్ట్ చేసింది ఎవరో తెలుసా..? మోస్ట్ మోస్ట్ స్పెషల్ పర్సన్..!

ప్రజెంట్ ..కోట్లాదిమంది టాలీవుడ్ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ కొరటాల శివ ఎంతో ఇష్టంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ షేడ్స్ లో కనిపించబోతూ ఉండడం గమనార్హం. తండ్రి పాత్రలో కొడుకు పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

“దేవా” పాత్రలో తండ్రి.. “వరా” పాత్రలో కొడుకు కనిపించబోతున్నారట . అందుకే ఈ సినిమాకి దేవర అనే టైటిల్ ని పెట్టారట . అయితే సినిమాకి టైటిల్ పెట్టే విషయంలో డైరెక్టర్ హీరో బాగా శ్రద్ధ తీసుకొని మరి నిర్ణయం తీసుకుంటారు. కానీ దేవర విషయంలో మాత్రం ఈసారి పూర్తి బాధ్యతలు ఎన్టీఆర్కి ఇచ్చేసాడట కొరటాల శివ . కధ వివరించి ఈ సినిమాకి ఏ టైటిల్ బాగుంటుందో మీరే చెప్పండి అంటూ సజెస్ట్ చేశారట.

మూడు రోజులు చర్చించిన తర్వాత .. ఈ సినిమాకు దేవర అనే టైటిల్ని పెట్టారట . కథలోని పాత్రలు పేర్లను ఆధారంగా చేసుకొని ఈ నిర్ణయం తీసుకున్నారట . అయితే ఈ సినిమాకి దేవర అనే పేరును పెట్టింది ఎన్టీఆర్ కాదు .. ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి అంటూ ఓ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుంది . ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది . మొదటి భాగం ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ కావాల్సి ఉంది . కానీ కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీ రిలీజ్ చేయబోతున్నారు..!!