ఆ హీరోయిన్‌తో సీనియ‌ర్‌ ఎన్టీఆర్ సీక్రెట్ మ్యారేజ్ ఆపేసిన స్టార్ హీరోయిన్‌..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్న హీరోలు ఎవరైనా ఒకే హీరోయిన్‌తో ఒకటికి నాలుగు సార్లు నటించారంటే వారిద్దరి మధ్య ఎఫైర్‌ ఉందని.. వారిద్దరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.యి అయితే మొదటి జనరేషన్ లో స్టార్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, ఏఎన్నార్లు ఒకే హీరోయిన్ తో పలు సినిమాలో నటించి మెప్పించేవారు. అలా ఎన్టీఆర్ తన సినీ కెరీర్‌లో కేవలం 47 మంది హీరోయిన్స్ తో మాత్రమే పనిచేశాడు. అందులో జమున 36 సినిమాల్లో, సావిత్రి 26 సినిమాల్లో, అంజలి 26 సినిమాల్లో నటించగా.. కృష్ణకుమారి 25 సినిమాల్లో ఆయనతో కలిసి నటించింది.

Sowcar Janaki: N T Rama Rao Wants To Marry With Krishna Kumari - Sakshi

ఈ నేపద్యంలో గతంలో ఎన్టీఆర్ పై కూడా ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్‌తో ప‌లు సినిమాల్లో కలిసి నటించిన కృష్ణకుమారితో ప్రేమాయణం నడిపాడ‌ని.. ఆయన వీరి పెళ్లిని పీటల వరకు తీసుకువెళ్లారని.. కానీ ఒక్కరోజు ముందు కొన్ని కారణాలతో ఈ పెళ్లి చెడిపోయిందంటూ వార్తలు వినిపించాయి. కాగా కృష్ణకుమారితో ఎన్టీఆర్ పెళ్లి చెడిపోవడానికి కారణం ఆమె సొంత అక్క షావుకారు జానకి అంటూ వార్తలు వినిపించాయి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షావుకారు జానకి.. దీనిపై స్పందించింది.

పేరుకు నేను.. కృష్ణకుమారి సొంత అక్క, చెల్లెళ్ళు అయినా ఎప్పుడూ ఎవరి జీవితం గురించి ఎవరు సలహాలు ఇచ్చుకోలేదని.. ఆమె నా సొంత చెల్లెలు అయినప్పటికీ ఆమె పెళ్లికి వెళ్లడం కూడా నాకు కుదరలేదు అంటూ వివరించింది. ఎన్టీఆర్‌ను త‌న చెల్లి ఎంతగానో ప్రేమించిందని.. వాళ పెళ్లి చివరి నిమిషంలో ఆగిపోవడానికి కారణం నేనేనంటూ చాలామంది అనుకున్నారని.. కానీ అది అసలు నిజం కాదంటూ చెప్పుకొచ్చింది. వారు ప్రేమించుకుని.. పెళ్లి చేసుకుంటే ఆపడానికి నేనెవరు అంటూ ప్రశ్నించింది. ఇక అప్పటికే ఎన్టీఆర్ కు 13 మంది పిల్లలు ఉన్నారని.. అయినా నేను ఎప్పుడు ఎన్టీఆర్ తో పెళ్లి వద్దని నా చెల్లికి చెప్పలేదు అంటూ చెప్పుకొచ్చింది.

పెళ్ళ‌యిన వాడిని చేసుకుంటే వచ్చే సమస్యల గురించి మాత్రమే నేను ఒకసారి వివరించాన‌ని.. అలా నేను చెప్పడం వల్ల నా చెల్లి బాగా హర్ట్ అయ్యిందని వివ‌రించింది. కొంతకాలం వరకు నాతో మాట్లాడలేదు.. చివరికి తన పెళ్లి శుభలేఖను పంపించింది.. కానీ నాకు వెళ్లడం కుదరలేదు అంటూ వివరించింది. తను నాకు లేదా నేను తనకు ఏ రోజు ఏదీ చేసుకోమని సలహాలు ఇవ్వలేదని. ఒక జీవితం గురించి ఒక నిర్ణయాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదని వివరించింది. అయితే ఎన్టీఆర్ పై కోపంతోనే బెంగళూరు వెళ్ళిన కృష్ణకుమారి అక్క‌డ ఓ బిజినెస్ మ్యాన్ వివాహం చేసుకుందని.. అయితే అతను కూడా రెండో పెళ్లి వాడే అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం షావుకారు జానకి చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ అవుతున్నాయి.