వరలక్ష్మి కి కాబోయే భర్త అంత దుర్మార్గుడా..? బయటపడ్డ సంచలన నిజాలు..!!

వరలక్ష్మి శరత్ కుమార్ .. ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ స్టార్ నటుడు శరత్ కుమార్ కూతురు. కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి క్రేజీ గుర్తింపు సంపాదించుకుంది . హీరోయిన్గా హిట్ కొట్టింది చాలా తక్కువే కానీ విలన్ గా నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . తెలుగు ఇండస్ట్రీలో లేడీ విలన్ అంటే ఇప్పుడు అందరికీ గుర్తొచ్చే పేరు వరలక్ష్మి శరత్ కుమార్ .

క్రాక్ సినిమాతో జయమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకుంది . పెళ్లి గిల్లి ఏమీ లేదు అంటూనే అభిమానులకి సడన్ షాక్ ఇచ్చింది .ఎవరికి తెలియకుండా చాలా సైలెంట్ గా సడన్ గా వరలక్ష్మి తన బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇంస్టాగ్రామ్ లో ఆమె షేర్ చేసిన ఫొటోస్ నిమిషాలలోనే వైరల్ అయిపోయాయి . వరలక్ష్మి శరత్ కుమార్ తన బాయ్ ఫ్రెండ్ నికోలై సచి దేవ్ ని ముంబైలో నిశ్చితార్ధం చేసుకుంది . ఈయన ఓ బిజినెస్మెన్ ..

అంతేకాదు ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. కాగా నికోలైకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . అతడికి ముందే మోడల్ కవితతో పెళ్లయిందట . వీరిద్దరికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి . వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారట. ఆ తర్వాతే వరలక్ష్మి శరత్ కుమార్ తో నిశ్చితార్థం చేసుకున్నాడట . అంటే వరలక్ష్మి శరత్ కుమార్ ఆయనకు రెండో భార్యగా వెళ్లబోతుందా..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు . ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే వరలక్ష్మి స్పందించాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్..!!