ఆ స్టార్ హీరో పెట్ తో దర్శనం ఇచ్చిన త్రిష… ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అంటూ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన త్రిష గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అంద‌ చందాలతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తూ ప్రస్తుత కాలంలో కూడా స్టార్ హీరోయిన్ లకి ధీటుగా తన కెరీర్ ను సాగిస్తుంది.

ప్రభాస్, నాగార్జున, ఎన్టీఆర్, వెంకటేష్, బాలయ్య ఇలా పలువురు స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది త్రిష. ఇక గత కొద్ది రోజుల నుంచి ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేయడం లేదు. కానీ తమిళ్లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవల లియో సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ 40 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు.

ఇక ఇటీవల పలువురు త్రిషపై కామెంట్స్ చేయడం వాటికి త్రిష స్పందిస్తూ మండిపడడం వంటివి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా త్రిష గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉన్నట్లుండి రామ్ చరణ్ పెట్ ని ఆడిస్తూ దర్శనమిచ్చింది త్రిష. దీంతో ప్రతి ఒక్కరూ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.