తారక్ ” దేవర ” సెట్స్ నుంచి పవర్ ఫుల్ స్టిల్ రిలీజ్.. హుషారులో ఫ్యాన్స్..!

నందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ మూవీ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 10.. 2024న వరల్డ్ వైడ్ గా థియేటర్లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్.

ఈ క్రమంలోనే ఈ మూవీ షూటింగ్ సర్వేగంగా జరుపుకుంటున్నారు చిత్ర బృందం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఇక ఈ షూట్ నుంచి తాజాగా ఓ స్టైలిష్ లుక్ రిలీజ్ అయింది. డైరెక్టర్ కొరటాల శివ మరియు రాజు సుందరం తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉన్న స్టిల్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోని చూసిన పలువురు మరింత క్యూరియాసిటీగా ఎదురుచూస్తున్నారు.