ఒకప్పుడు కూలిగా.. ఇప్పుడు సూపర్ స్టార్ట్.. రిషబ్ శెట్టి సక్సెస్ స్టోరీ ఇదే..

శాండిల్‌వుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు రిషబ్‌ శెట్టి. ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న ఈయన కాంతారా 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు స్టార్ స్టేటస్‌లు, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న రిషిప్ శెట్టి.. గతంలో ఎన్నో కష్టాలను అనుభవించాన‌ని.. తాను ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఇటీవల వివరించాడు. ఇంతకీ రీషబ్‌శెట్టి తన జీవితంలో ఎటువంటి కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం. రిషబ్ శెట్టి ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాల్లో రావడానికి ముందు తను చాలా కష్టాలు అనుభవించాన‌ని.. ఎన్నో ఉద్యోగాల్లో చేశానని.. నా అవసరాల కోసం ఎప్పుడూ నా తల్లిదండ్రుల ముందు చేయించాలేదంటూ చెప్పుకొచ్చాడు. మొదట నేను ఇండస్ట్రీలో క్లర్క్‌ బాయ్‌గా పని చేశానని.. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశానని రిషబ్ శెట్టి చెప్పుకొచ్చాడు.

యాక్టర్ కావాలని ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన నాకు.. ఎవరు పరిచయం లేకపోవడంతో అసలు యాక్టర్ కావడానికి ఎవరిని అప్రొచ్ అవాలో.. ఎలా అప్రోచ్ అవాలో.. కూడా తెలియదని రిషబ్ శెట్టి చెప్పుకొచ్చాడు. ఒక కన్నడ నటుడు అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్‌ను మొదలుపెట్టి హీరోగా ఎలా మారాడో చదివి.. దాని నుంచి కొంచం తెలుసుకున్నానని చెప్పుకొచ్చాడు. నటనపై ఆసక్తితో ఫిలిం మేకింగ్ గురించి కూడా నేను షార్ట్ టైమ్ కోచింగ్ చేశానని.. రిషబ్ శెట్టి చెప్పుకొచ్చాడు. డిగ్రీ చదివే టైం లోనే డబ్బులు లేక కూలి పనులకు వెళ్లే వాడినని చెప్పిన ఆయన మొదటి సినిమా డైరెక్షన్ చేసే వరకు వాటర్ క్యాన్లు అమ్మడం, రియల్ ఎస్టేట్, హోటల్స్ లో పనిచేయడం ఇలా ఎన్నో కష్టతరమైన పనులను కూడా చేశానంటూ కామెంట్స్ చేశాడు. చదువుకున్న టైంలో సినిమాల్లో ఆఫర్ల కోసం ప్రయత్నించినా అవి వర్కౌట్ కాలేదట‌.

తుగ్లక్ అనే సినిమాలో నేను మొదట నటించానని వివరించాడు. ఈయ‌న డైరెక్షన్‌లో తెరకెక్కిన రిక్కీ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఆయ‌న డైరెక్షన్‌లోనే వచ్చిన కిర్రాక్ పార్టీ బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసింది. అలా మొదట కూలివాడిగా ఎన్నో కష్టాల్లో అనుభవించిన రిషబ్ శెట్టి.. అంచలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం శాండిల్ వుడ్ లోనే స్టార్ హీరోగా అందరు గుర్తించదగిన హీరోగా ఎదిగాడు. కేవలం శాండిల్ వుడ్ లోనే కాదు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా రిష‌బ్ శెట్టికి అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. కాంతర తెలుగులో డబ్బింగ్ అయిన తరువాత ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. ఈయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.