‘ రంగస్థలం ‘ కాంబో రిపీట్.. వ‌ర్కౌట్ అయ్యితే మరో రేర్ రికార్డ్ ప‌క్కా..!!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి ఒక్క సినిమా కూడా రాకపోవడంతో.. ఫ్యాన్స్ అంతా రామ్ చరణ్ నుంచి వచ్చే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న గేమ్ చేంజర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ నత నడకగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఫ్యాన్స్ కూడా డైరెక్టర్ శంకర్, నిర్మాత దిల్ రాజులపై ఫైర్ అయ్యారు. కాగా ఇంకా సినిమా షూటింగ్ పూర్తికాకుండానే మరో భారీ పాన్ ఇండియా సినిమా ప్రారంభోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. రామ్‌చరణ్, బుచ్చిబాబు సన డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రేక్షకుల్లో ముందు నుంచే మంచి హైప్‌ నెలకొంది.

Ram Charan - Biography, Age, Wife, Career, Movies

ఏఆర్ రెహమాన్, జాన్వి కపూర్, శివరాజ్ కుమార్ ఇలా ఎంతోమంది ప్రముఖులు ఈ సినిమాలో వర్క్ చేయనున్నారు. ఇక ఇంకా ఈ సినిమా పూర్తిగా సెట్స్‌పై కైనా రాకముందే మరో క్రేజీ కాంబోతో రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రంగస్థలం లాంటి నాన్ బాహుబలి హిట్ ఇచ్చిన సుకుమార్.. మరోసారి రామ్ చరణ్ తో సినిమా చేయనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కాంబినేషన్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందట. మార్చి 27న.. RC17 కూడా అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది. ఆల్మోస్ట్ రంగస్థలం సినిమాకి పనిచేసిన వాళ్లంతా ఈ సినిమాకు కూడా పనిచేయనున్నారు.

RamCharan| 'రంగస్థలం' కాంబోకి రంగం సిద్ధమైంది.. ఈ సారి బాక్సాఫీసు బద్దలే

మైత్రి మూవీ సంస్థ నిర్మాణంలో దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడుగా వివరించనున్నట్లు తెలుస్తోంది. సుకుమార్, రామ్‌చ‌రణ్ ఇద్దరు ఇప్పుడు పాన్‌ ఇండియా సెలబ్రిటీలు కావడంతో.. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. ఇక ప్రస్తుతం సుకుమార్ పుష్పా 2తో బిజీగా ఉన్నాడు. ఆగస్టు నుంచి సుకుమార్ ఫ్రీ అవుతారు. ఆ తర్వాత రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి చేసి ఈ ఇయర్ ఎండింగ్ లో షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు బుచ్చిబాబు సినిమాకి, ఇటు సుకుమార్ సినిమాకి చరణ్ పార్లర్గా వర్క్ చేస్తారట. అయితే అలా జరిగితే మాత్రం నిజంగానే గుర శిష్యులిద్దరు ఒకేసారి ఒకే హీరోతో రెండు సినిమాలు తెరకెక్కించిన రేర్ ఫీట్ సొంతం చేసుకుంటారు.