ఆ సినిమాలో తారక్ నటించి ఉంటే..ఒక్కోక్కడికి ఉ* పడిపోయేదిగా..మంచి ఛాన్స్ మిస్..!!

జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరు చెప్తే ఇండస్ట్రీలో ఉండే అభిమానులు ఏ రేంజ్ లో ఊగిపోతారో మనకు తెలిసిందే. నందమూరి నట వారసుడిగా బాగా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాకు దేవర అంటూ పేరు ఫిక్స్ చేశారు. ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు ఎన్టీఆర్ .

ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది .. రెండవ హీరోయిన్ ఈ సినిమాలో ఉంది అని .. ఆ పాత్ర సస్పెన్స్ అంటూ మేకర్స్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు . మీడియాలో తారక్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. తారక్ ఆ సినిమా చేసుంటే మిగతా హీరోలకి చెమటలు పట్టేసేటివి అని .. మరికొందరు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . ఆ సినిమా మరేదో కాదు “కాంతారా”…

రిషిబ్ శెట్టి హీరోగా తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసింది . తెలుగులో కూడా ఈ సినిమా డబ్ చేసి మంచి విజయం అందుకున్నారు . అయితే తెలుగులో డబ్ చేయకుండా రిషిబ్ శెట్టి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసి అందులో కన్నడలో రిషిబ్ శెట్టి పాత్రను ఎన్టీఆర్ తెలుగులో పోషించి ఉంటే మాత్రం సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేది అని చెప్పుకొస్తున్నారు . నందమూరి ఫ్యాన్స్ కూడా ఇదే విషయాన్ని బాగా ట్రెండ్ చేస్తున్నారు . నిజంగానే అలాంటి పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తే అభిమానులకి పూనకాలు వచ్చేటివి అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . జస్ట్ మిస్..నెక్స్ట్ ఇలాంటి పాత్ర వస్తే మాత్రం మిస్ చేసుకోవద్దు అంటూ ఎన్టీఆర్ కి సజెషన్స్ ఇస్తున్నారు..!!