ఇప్పటివరకు ఒక్క రీమేక్ సినిమాలో కూడా నటించని సౌత్ స్టార్ హీరోల లిస్ట్ ఇదే..

సినీ ఇండస్ట్రీలో తమ అభిమాన హీరో, హీరోయిన్లకు నటీనట్లకు సంబంధించిన ఏ విషయమైనా తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపుతూ ఉంటారు. అదేవిధంగా వారికి నచ్చిన హీరోకు సంబంధించిన ఏదైనా న్యూస్ వినిపిస్తే దానిని తెగ ట్రెండ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు మన టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరో, హీరోయిన్లు రీమేక్ సినిమాల్లో నటించి మెప్పించారు. కానీ కొంతమంది స్టార్ హీరోస్ మాత్రం వారి సినీ కెరీర్‌ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక్క రీమేక్ సినిమాలో కూడా నటించకుండా భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. అలా రీమేక్ సినిమాల జేలికి పోకుండా స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న సౌత్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Pic Talk: Mahesh Babu surprises fans with a clean-shaved look | Latest  Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

మహేష్ బాబు :
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇప్పటివరకు 28 సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాలు నటించి ప్రేక్షకులను అక‌ట్టుకున్న‌ మహేష్ చివరగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి స‌క్స‌స్ సాధించాడు. అయితే ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో మహేష్ బాబు ఒక్క రీమేక్ సినిమాలో కూడా నటించలేదు. రీమేక్ తీసే ఛాన్స్ వచ్చినా మహేష్ బాబు వాటిని సున్నితంగా రిజెక్ట్ చేసాడు.

Vijay Deverakonda for his second bilingual movie

విజయ్ దేవరకొండ :
పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం రౌడీ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస‌ సినిమాలో నటిస్తున్న విజయ్.. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్‌లో బిజీగా గడుపుతున్నాడు. అయితే విజయ్ దేవరకొండ కూడా రీమేక్‌ల‌ జోలికి వెళ్లకుండా స్ట్రెయిట్ సినిమాల్లో మాత్రమే నటిస్తున్నాడు.

Dulquer Salmaan's COP Thriller Gets A Title; To Start Rolling In January  2021 - Filmibeat

దుల్కర్ సల్మాన్ :
మలయాళ స్టార్ హీరోగా భారీ సంపాదించుకున్న ఈయనకు.. టాలీవుడ్ లో కూడా మంచి పాపులారిటీ ఉంది. విలక్షణ కథలను ఎంచుకుంటూ వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న దుల్క‌ర్‌ సల్మాన్.. ఇప్పటివరకు ఎటువంటి రీమిక్స్ సినిమాలోని నటించలేదు. కేవలం స్ట్రైట్ సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Rakshit Shetty - Wikipedia

రక్షిత్ శెట్టి
కన్నడలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ శెట్టి.. ఇటీవల సప్తసాగర దాచే ఎల్లో.. సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో కూడా సప్త సాగరాలు దాటి పేరుతో రిలీజై పాజిటివ్ టాక్ దక్కించుకుంది. అయితే ఈయన సినీ కెరీర్‌లో రీమేక్ సినిమాలో నటించకూడదనే పాలసీ పెట్టుకున్నాడట.