మహేష్ బాబు ను డీప్ గా హర్ట్ చేసిన ముగ్గురు డైరెక్టర్స్ వీళ్లే.. ఎంత దారుణం అంటే..!

కొన్నిసార్లు మనం ఏదో అనుకుంటాం.. ఇంకేదో జరిగిపోతూ ఉంటుంది. ఒక హీరోని అర్థం చేసుకొని .. ఆ హీరో బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు సినిమాలను తెరకెక్కించడమే డైరెక్టర్ పని . కొన్నిసార్లు ఆ విషయంలో కొందరు డైరెక్టర్లు ఫ్లాప్ అవ్వచ్చు .. దాని ద్వారా ఆ హీరో ఇండస్ట్రీలో కోలుకోలేని షాక్ కూడా తినొచ్చు . ఆ లిస్ట్ లోకి వస్తాడు మహేష్ బాబు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు డైరెక్టర్ లు ఆయన ను ముంచేశారు . వాళ్ళు మరెవరో కాదు పరశురాం ..శ్రీకాంత్ అడ్డాల.. త్రివిక్రమ్ శ్రీనివాసరావు.

శ్రీకాంత్ అడ్డాల: బ్రహ్మోత్సవం సినిమాను మహేష్ బాబు ఎంత నమ్మకంగా చేశాడో చూసాం. ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు . అయితే ఏం లాభం ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . మహేష్ బాబు అభిమానులు కూడా ఛీ కొట్టారు .

పరశురాం : సర్కారి వారి పాట సినిమాతో మహేష్ బాబు మరో మైల్ స్టోన్ అందుకుంటాడు అనుకున్నాము. అయితే యావరేజ్ గా నిలిచింది . గీతాగోవిందం లాంటి హిట్ సినిమాను తెరకెక్కించిన పరశురాం మహేష్ బాబుతో ఇంత దారుణంగా సినిమాను తీస్తాడు అంటూ షాక్ అయిపోయారు జనాలు .

త్రివిక్రమ్ శ్రీనివాసరావు : గుంటూరు కారం సినిమా విషయంలో ఇప్పటికి ఆయనను ఏకేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. గుంటూరు కారం సినిమా విషయంలో మహేష్ బాబు ట్రోలింగ్ ఎదుర్కోవడానికి కర్త – కర్మ – క్రియ అంతా త్రివిక్రమ్ నే అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. ఇలా ఈ ముగ్గురు డైరెక్టర్ లు మహేష్ ని ముచేశారు అంటూ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు..!!