కమల్ హాసన్ కి ఆ తెలుగు హీరో అంటే అంత ఇష్టమా..? 100 సార్లు ఆ మూవీ చూశాడా..?

కమల్ హాసన్ .. లోకనాయకుడిగా సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . స్టార్ హీరోస్ అందరూ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే కమల్ హాసన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే.. లేడీస్ – గర్ల్స్ – కిడ్స్ ఇలా అందరూ కూడా ఆయనకు ఆయన నటనకు ఫిదా అయిపోతూ ఉంటారు . ఇలాంటి పాత్రలే చేయాలి అని గిరి గీసి పెట్టుకోకుండా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఉంటాడు .

మరీ ముఖ్యంగా కమల్ హాసన్ ఏ విషయాన్నైనా ఓపెన్ గా చెప్పేస్తాడు . కమల్ హాసన్ తెలుగులో ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. దాని తాలూకా న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . కమల్ హాసన్ కి తెలుగులో స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నటన అంటే చాలా చాలా ఇష్టమట . ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ చాలా చాలా బాగుంటుంది అని ఆయన నటించిన సినిమాలో దానవీరశూరకర్ణ సినిమా వందసార్లు పైగానే చూశాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు .

దీంతో నందమూరి ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఆయన నటన ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా..? అంటూ తెగ పొగిడేస్తున్నారు. కమల్ హాసన్ ఈ వయసులోనూ తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తున్నాడు . అంతేకాదు ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టుకే సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు . ఈ సినిమా ద్వారా ఆయన మరో వైల్డ్ యాంగిల్ ను బయట పెట్టబోతున్నాడు అంటూ ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు..!