నా లైఫ్‌లో హీరో శ్రీ‌హ‌రి గారు అస‌లైన గాడ్‌.. స్టార్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్.. ఎంతోమంది ఆపదలో ఉన్న వారికి అవసరమైన వారికి సహాయం చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే గతంలోనూ పాత తరం హీరోస్ కూడా చాలామంది ఇతరుల అవసరాన్ని బట్టి సహాయం చేస్తూ ఉండేవారు. చిన్న, పెద్ద, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో అని లేకుండా ప్రతి ఒక్కరూ త‌మ‌కి తోచిన సహాయం చేస్తూ సంతృప్తి చెందేవారు. కొందరు నటి, నటులైతే తమకు వచ్చిన పూర్తి రమ్యునరేషన్ ఆపదలో ఉన్న వారికి త్యాగం చేసేవారు. అలాంటి వారిలోనే ఒకప్పటి స్టార్ హీరో శ్రీహరి ఒకరు. ఎన్నో సినిమాల్లో తన పైవిద్యమైన నటనతో ఆకట్టుకున్న శ్రీహరి గారు సేవా కార్యక్రమాల్లోనూ ముందడుగు వేసే వారు. ఎప్పటికప్పుడు తన మానవత్వాన్ని చూపించేవారు. ప్రస్తుతం ఆయన మన అందరితో లేకపోవడం దురదృష్టకరం. ఇక ఎవరైనా ఒక మంచి పని చేస్తే వారి లేకపోయినా వారు చేసిన సహాయం ఎప్పటికీ ఉండిపోతుంది అంటారు. దానికి ఉదాహరణ ఇదేనేమో. తాజాగా శ్రీహరి చేసిన ఓ గొప్పప‌ని గురించి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఒకరు వివ‌రించారు.

ఆ డైరెక్టర్ మరెవరో కాదు కొల్లి బాబి. బాబీ దర్శకత్వం వహించినది అతి తక్కువ సినిమాలైనా త‌న మివీస్‌తో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక బాబి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా లైఫ్ లో నిజంగా చూసిన గార్డ్ అంటే హీరో శ్రీహరి గారే. నేను హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చినప్పుడు మా అమ్మ నాతో రోజు అనేది.. నాకు శ్రీహరి గారు దేవుడులా కనిపిస్తున్నారు అని.. ఆయన అలాంటి మంచి గొప్ప పనులు చేయడం వల్లే ఎంతో మందికి దేవుడిలా నిలిచాడు ఆయన చేసిన మంచి పనులకు ఉదాహరణ చెప్పాలంటే శ్రీహరి గారికి మిడ్‌నైట్ దాదాపు 12:30 నుంచి 1:00 సమయంలో ఓ కాల్ వచ్చింది, అయ‌న‌ లిఫ్ట్ చేసాడు. ఎవరో షిరండి నుంచి బస్సులు వస్తూన్నారు. వైఫ్‌, హస్బెండ్, ఇద్దరు పిల్లలు ఏడుస్తూ మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పిన సమస్య ఏంటంటే షిరిడి నుంచి వస్తుంటే బస్సులో ఒక తెలియని ముఠా మందు తాగి కూర్చుని తన వైఫ్ ని ఆడపిల్లల్ని కామెంట్ చేస్తున్నాడు. కోపం వచ్చి ఆయన ఆ రౌడీలను అరిశేసాడట.

దీంతో వాళ్ళు చేసిన ఛాలెంజ్ ఏంటంటే.. బస్సులో చాలా మంది ఉన్నారు.. హైదరాబాద్ వెళ్ళేలోగా ఎవరు రాకపోతే మేమందరం కలిపి నీ అంత చూస్తాం అని వార్నింగ్ ఇచ్చారట. ఇక ఎవరికి ఫోన్ చేయాలో తెలియని ఆ వ్యక్తి అప్పుడే శ్రీహరి గారు నెంబర్ ఇచ్చారంటే గొప్పగా చెప్పుకుంటున్న వ్యక్తి దగ్గర నుంచి ఆ నెంబర్ తీసుకుని ఆయనకు ఫోన్ చేసి విషయాన్ని వివరించారు. ఇక విషయం తెలుసుకున్న శ్రీహరి గారు దేవుడి దగ్గర నుంచి వ‌స్తున్న‌టున్నారు.. గొడవ పడకండి.. మా వాళ్ళు అక్కడికి వస్తారు అని వివరించారు. ఇక హైదరాబాద్‌కి బ‌స్ వచ్చేసింది. తర్వాత బస్సు దిగేముందు అన్నా ఎవరైనా వచ్చారా అని కాల్ చేసి అడగగా.. నువ్వు ముందు బస్సు దిగిరా అన్న అని వివరించారు. తీరా బస్సు దిగి చూస్తే స్వయంగా ఐదు గంటలకు నిద్ర లేచి శ్రీహరి గారే వాళ్ళ కోసం అక్కడికి వచ్చారు. అంత హోదా ఉన్న మనిషి ఓ సాధారణమైన వ్యక్తి ఫోన్ చేసి ఆపదలో ఉన్నానంటే ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా బస్టాండ్ కి వచ్చి నిలబడడం అనేది సాధారణ విషయం కాదు.. అంటూ బాబి వివరించాడు.