కంటెంట్ నచ్చితే చిన్న సినిమాలకు కూడా ఓకే అంటున్న స్టార్ హీరోయిన్స్ వీళ్లే..

ఏ సినిమాలో అయినా హీరోకి తగ్గ హీరోయిన్లు ఉంటేనే సినిమా అద్భుతంగా కొనసాగుతుంది. ప్రేక్షకులు కూడా ఆ రేంజ్ లో ఉన్న సినిమానే చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ప్రతి హీరోయిన్ కూడా తన రేంజ్‌కు తగ్గట్టుగా హీరోని ఎంచుకోవాలని ప్రయత్నిస్తుంది. దానివల్ల వారి స్టార్డం మ‌రింత పెరుగుతుందని.. ఎటువంటి ఇంట్రప్షన్స్ ఉండవని వారు భావిస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటువంటి వరవడి మారుతుందని తెలుస్తోంది. ఎందుకంటే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా కథ నచ్చితే ఎంత చిన్న స్థాయి హీరో కైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. అలా స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ సంపాదించుకొని చిన్న హీరోలతో నటించిన మన టాలీవుడ్ హీరోయిన్లు ఎవరో ఒకసారి చూద్దాం.

కీర్తి సురేష్ :


మహానటి సినిమాతో నేషనల్ వైడ్‌గా గుర్తింపును తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాకు గాను నేషనల్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈక్ర‌మంలో కీర్తి సురేష్ టాలీవుడ్ లో ఓ చిన్న‌ హీరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ హీరోగా రూపొందుతున్న ఉప్పు కప్పురంబు లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వేడుకల్లో సుహాస అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

ర‌ష్మిక మంద‌న‌:


ఇక నేషనల్ క్ర‌ష్ ర‌ష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆమె కథ నచ్చితే ఎలాంటి చిన్న సినిమాలకైనా ఓకే చెప్పిస్తోంది. తాజాగా రెయిన్బో సినిమాలో ఫిమేల్ సెంట్రిక్ క‌త‌తో ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌చ్చేందుకు సిద్ధం అయ్యింది రష్మిక. ఇందులో మలయాళ చిన్న హీరో దేవ్ నటిస్తున్నాడు.

స‌మంత‌:


ఇక సమంత కూడా గతంలో పాన్ ఇండియా సినిమా శకుంత‌లం లో నటించాడు. సమంత గతంలో ప‌లు లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటైన శకుంతలంలో సమంత సరసన దేవ్ మోహన్ నటించి మెప్పించాడు.

అనుష్క‌:


టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క కూడా మిడిల్ రేంజ్‌ హీరో అయిన నవీన్ పోలిశెట్టితో ఇటీవల మిస్‌శెట్టి మిస్టర్ పోలీశెట్టి సినిమాలో నటించి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇలా ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోయిన్స్ అంతా కథలో కంటెంట్ ఉందనిపిస్తే చిన్న హీరోలతో అయినా సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు.