అప్పుడు పవన్ కళ్యాణ్.. ఇప్పుడు బాలకృష్ణ.. ఫ్యాన్స్ కి ఊహించని షాక్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో హీట్ పెంచేస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీకి నందమూరి బాలకృష్ణ దూరం కాబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . మనకు తెలిసిందే త్వరలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కేవలం కొద్ది రోజులు అంటే కొద్ది రోజుల్లోనే ఏపీకి కొత్త సీఎంగా ఎవరు రాబోతున్నారు అనే విషయంపై క్లారిటీ రాబోతుంది మనందరికీ బాగా తెలుసు . ప్రజెంట్ టిడిపి – జనసేన – బిజెపి ఒకటిగా పోటీ చేస్తుంది .

కచ్చితంగా ఈసారి విజయం టిడిపి – జనసేన లదే అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . అయితే పవన్ కళ్యాణ్ సీఎం అయితే సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరం కాబోతున్నాడు అంటూ ఇన్నాళ్లు ప్రచారం జరిగింది . ఆఫ్ కోర్స్ అదే నిజమంటూ కూడా ఫాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు . అయితే ఇప్పుడు తాజాగా బాలకృష్ణ కూడా అదే రూట్లోకి వెళ్ళబోతున్నాడట. టిడిపి జనసేన అధికారంలోకి ..వస్తే ఖచ్చితంగా బాలకృష్ణకి మంత్రి పదవి రావడం ఖాయం.

అప్పుడు బాలకృష్ణ సినీతెరపై చిందులు వేస్తే.. కావాలని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆయనను తప్పుపట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే బాలయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారట . సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పాలి అని ఆయన వారసుడిగా మోక్షజ్ఞను ఎంట్రీ ఇప్పించాలి అని ఫిక్స్ అయ్యారట . ప్రజెంట్ ఇదే న్యూస్ సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . నందమూరి నటసింహం బాలయ్య ఇండస్ట్రీకి దూరమైతే ఫ్యాన్స్ తట్టుకోగలరా ..? అంటున్నారు జనాలు..!!