ఎన్టీఆర్ అంటే అంతే..ఆ అట్టర్ ఫ్లాప్ చిత్రానికి అంత క్రేజా.. ఇదెక్కడి అరాచకం రా బాబోయ్..!!

జూనియర్ ఎన్టీఆర్ కి ఇండస్ట్రీలో ఎంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించే సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉంటాయి. అఫ్కోర్స్ ఆయన నటించిన కొన్ని సినిమాలు భారీ డిజాస్టర్ కూడా అందుకున్నాయి . కానీ నటన పరంగా ఆయన నటించిన సినిమాలు మాత్రం ఇప్పటివరకు ఏది ప్లాప్ అవ్వలేదు. హిందీలో కూడా ఎన్టీఆర్కి అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ నేరుగా హిందీ చిత్రాలలో కూడా నటిస్తూ ఉండడం గమనార్హం .

త్వరలోనే వార్ 2 సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు మన తారక్. ఎన్టీఆర్ నటించిన చాలా చిత్రాలు హిందీలో కూడా డబ్ అయ్యి హిట్ అయ్యాయి. కొన్ని అట్టర్ ప్లాప్ అయ్యాయి. తారక్ ఆవేశంతో చేసిన సినిమాలు అన్నీ కూడా సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకున్నాయి . ముఖ్యంగా తెలుగులో తారక్ నటించిన అశోక్ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయింది . అదే నార్త్ లో మాత్రమే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

ఎన్టీఆర్ అంటే జనాలు పడి చచ్చిపోవడానికి ఈ సినిమానే కారణం . అంతటి క్రేజ్ తెచ్చి పెట్టింది . నార్త్ లో ప్రతి ఇంట్లో కుర్రాడిలా ఎన్టీఆర్ నీ మార్చేసింది ఈ సినిమానే కావడం గమనార్హం. నార్త్ లో బుల్లితెరపై ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కరెక్ట్ అయింది అశోక్ . ఈ సినిమా తెలుగులో అట్టర్ ఫ్లాప్ అయినా.. ఈ సినిమా నార్త్ లో సూపర్ డూపర్ హిట్ అవ్వడం గమనార్హం. ప్రజెంట్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు.

ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా కూడా చేయబోతున్నాడు. దీంతో ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు బాలీవుడ్లో మరో మూడు ఫీలింల కి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దానిపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన అయితే లేదు. అయితే ఎన్టీఆర్ ఎక్కడ ఉంటే అక్కడ ఇండస్ట్రీ బ్లాస్ట్ అవ్వడం పక్క అంటున్నారు అభిమానులు..!!