రజనీకాంత్ ను అవమానించిన ప్రొడ్యూసర్.. తన స్టైల్లో సమాధానం ఇచ్చిన సూపర్ స్టార్..

సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి సూపర్ స్టార్‌గా పాపులారిటి దక్కించుకున్న వారిలో రజినీకాంత్ ఒకరు. కృషి, పట్టుదల, టాలెంట్ ఉంటే ఎటువంటి వారైనా తమ అనుకున్నది సక్సెస్ చేసుకోగలరని రజనీకాంత్ ప్రూవ్ చేశాడు. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎంతమందికి ఆదర్శంగా నిలిచే రజినీకాంత్ కెరీర్ స్టార్టింగ్ లో చిన్ని చిన్ని క్యారెక్టర్స్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే అలాంటి సమయంలో రజిని ఎన్నో సమస్యలను.. ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాగా రజినీకాంత్ చిన్న క్యారెక్టర్ లో నటించే టైంలో ఓ ప్రొడ్యూసర్ రజినీకాంత్ ను సంప్రదించాడట.

ఒక క్యారెక్టర్ చేయాలని దానికి రూ.6వేలు ఇస్తామంటూ రజనీకాంత్ కు ఆఫర్ చేశారు. అప్పట్లో ఆ అమౌంట్ తనకు ఎక్కువ కావడంతో రజిని కూడా ఆ క్యారెక్టర్ కు ఓకే చెప్పాడు. కాగా డబ్బు అవసరం పడి అడ్వాన్స్ రూ. వెయ్యి ఇవ్వాలని అతడిని అడిగాడట రజిని. షూటింగ్ స్పాట్ కి వచ్చాక ఇస్తానని నిర్మాత మాట ఇచ్చి రజనీకాంత్ ను వెనక్కు పంపారు. మరుసటి రోజు రజనీకాంత్ షూటింగ్ స్పాట్ కి వెళ్లి క్యారెక్టర్ కి తగినట్లు మేకప్ వేసుకున్నాడ‌ట. త‌ర్వాత‌ మేనేజర్‌ని పిలిచి రూ.వెయ్యు అడ్వాన్స్‌గా ఇప్పిస్తారా అని అడగ్గా.. అప్పుడే అక్కడికి నిర్మాత వచ్చి నువ్వేదో మూడు, నాలుగు సినిమాల్లో నటించినట్లు ఈ ఓవరాక్షన్ ఏంటి.. అప్పుడే నీకు అడ్వాన్స్ ఇవ్వాలా అంటూ తిటాడ‌ట‌.

అసలు ఈ సినిమాల నీకు ఏ క్యారెక్టర్ లేదు.. నువ్వు వెళ్ళిపో అని చాలా దురుసుగా రజనీకాంత్ ను విమర్శించాడట. దాంతో ఎంతో అవమానంగా ఫీలైన రజిని తనను ఇంట్లో డ్రాప్ చేయడానికి కారు పంపించాలని కోరారు. నీ మొఖానికి కారు కూడా కావాలా.. నడుచుకుంటూపో అని సదరు నిర్మాత ఆయనను అవమానించాడట. దీంతో రజనీకి కూడా బాగా కోపం వచ్చి ఇప్పుడు ఏ ఏవీఎం స్టూడియోలో నన్నుఅవమానించావు మళ్ళీ ఇదే స్టూడియోకి నేను కార్ తో వస్తా.. నీ చేతే దండం పెట్టించుకుంటా అలా చేయకపోతే నా పేరు రజనీకాంత్ కాదు అని ఛాలెంజ్ చేశారట. ఆ చాలెంజ్ చేసినట్లే రజినీకాంత్ రెండేళ్ళ‌లోనే ఏవీఎం స్టూడియో కి కారులో వెళ్లి అక్కడ కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని సిగరెట్ తాగుతూ.. తనదైన స్టైల్ లో ప్రొడ్యూసర్ కు.. బుద్ధి చెప్పాడు.