హవ్వ ..తమన్నా ఇంత బోల్డా..? ఆ విషయాన్ని సిగ్గుపడకుండా పచ్చిగా బయటపెట్టేసిందిగా..!!

ఈ మధ్యకాలంలో తమన్నా పేరు ఇండస్ట్రీలో ఎలా మారు మ్రోగిపోతుందో మనం చూస్తున్నాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నంతవరకు చాలా చక్కగా మంచిగా మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ .. ఎప్పుడైతే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లిందో.. అప్పటినుంచి బోల్డ్ బ్యూటీ అంటూ ట్యాగ్ చేయించుకుంది . మరీ ముఖ్యంగా తమన్నా జీకర్దా వెబ్ సిరీస్ చూసిన తర్వాత జనాలు షాక్ అయిపోయారు.

ఓ రేంజ్ లో అల్లాడిపోయారు ..తమన్న హాట్ నెస్ కి హీట్ ఎక్కేలా చెమటలు కార్చుకునేశారు. అప్పట్లో దీనిపై ట్రోలింగ్ కూడా జరిగింది. రీసెంట్గా తమన్న వాటికి క్లారిటీ ఇచ్చింది . “సోషల్ మీడియాలో చాలా ప్రచారాలు జరుగుతూ ఉంటాయి .ప్రతి ఒక్కరికి స్టార్ సెలబ్రిటీస్ పర్సనల్ లైఫ్ పైనే కాన్సన్ట్రేషన్ .. మా జీవితాలలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆత్రుత ఉంటుంది ..అందుకే ఏం జరిగినా జరగకపోయినా జరిగిపోయింది అంటూ ప్రచారం చేస్తూ ఉంటారు”..

” ట్రోలింగ్ పై నేను అస్సలు పట్టించుకోను.. మా లైఫ్ లో జరిగే బాధలు ఎదుర్కొన్న సిచువేషన్స్ ఎన్నో ఉంటాయి.. అవి అర్థం చేసుకోలేని వాళ్ల గురించి మేమెందుకు టైం వేస్ట్ చేసుకోవాలి. నేను అస్సలు అలాంటివి పట్టించుకోను” అంటూ ఓపెన్ గా ఉన్నది ఉన్నట్లు చెప్పుకొచ్చింది . అఫ్కోర్స్ తమన్న మాట్లాడిన మాటల్లో నిజాయితీ నీతి ఉన్నా కూడా ఇంత బోల్డ్ గా మాట్లాడుతారా అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు..!!