జబర్దస్త్ యాంకర్స్ రష్మీ, అనసూయ పై కిర్రాక్ ఆర్పి షాకింగ్ కామెంట్స్.. వాళ్ళిద్దరూ అలాంటి వాళ్ళంటూ..

జబర్దస్త్ కామెడీ షో ద్వారా భారీ పాపులారిటి ద‌క్కించుకొన్ని సెలబ్రిటీస్ గా మారిన వారిలో కిరాక్ ఆర్పి ఒక‌రు. ఇక జబర్దస్త్ మొదలు పెట్టిన తర్వాత నుంచి ఎన్నో ఏళ్ళు కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కిర్రాక్ ఆర్పి ప్ర‌స్తుతం జబర్దస్త్ నుంచి తప్పుకొని చేపల పులుసు వ్యాపారంలో రాణిస్తున్నాడు. అది సక్సెస్ అవడంతో బాగా సంపాదిస్తున్నాడు. అయితే తాజాగా కిర్రాక్ ఆర్పి ఓ ఇంటర్వ్యూలో సందడి చేశాడు. ఇందులో జబర్దస్త్ కమెడియన్స్, జడ్జెస్, యాంకర్ల గురించి మాట్లాడుతూ తన స్టైల్లో స్పందించాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆర్పి.. రష్మీ, అనసూయ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 2013లో జబర్దస్త్ ఓ ఎక్స్పరిమెంట్ షో గా ప్రారంభమైంది. రోజా, నాగబాబు జడ్జ్‌లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే మునుపన్నడు లేని విధంగా అనసూయ యాంకరింగ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేసింది.

Kiraak Rp Chepala Pulusu,Kiraak RP Curry Point: జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్పీ  'చేపల పులుసు' కర్రీ పాయింట్ క్లోజ్.. సింపుల్ రీజన్ - jabardasth fame kiraak  rp closed nellore pedda reddy ...

స్క్రీన్ షో కి ఆస్కారం ఇస్తూ గ్లామర్ షో తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత పర్సనల్ కారణాలతో అనసూయ జబర్దస్త్ బ్రేక్ ఇచ్చింది. ఆ టైంలో రష్మీ జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చింది. అనసూయను ఫాలో అవుతూ గ్లామర్ షోలో ర‌ష్మి కూడా రెచ్చిపోయింది. అయితే దీనివల్ల ఇద్దరు కొన్ని ట్రోలింగ్స్ ఎదుర్కొన్న భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. గతంలో వీరిద్దరిలాగా స్కిన్ షో చేస్తూ యాంకరింగ్ తో ఆకట్టుకున్న వారు లేరు. ఇక అనసూయ తర్వాత రీఎంట్రీ ఇవ్వడం రష్మి గౌతమ్ తో ఎక్స్ట్రా జబర్దస్త్ ప్లాన్ చేశారు మేకర్స్. ఇక ప్రస్తుతం అన‌సూయా షో నుంచి తప్పుకుంది. రష్మీ ఈ షోని బ్యాలెన్స్ చేస్తుంది. ఇక ఏళ్ల తరబడి క‌మెడియ‌న్‌గా ఉన్న ఆర్పీ ఈ షోలో యాంకర్‌లుగా వ్యవహరించిన రష్మీ, అనసూయ గురించి వివరించాడు.

Only these two for Jabardasth

ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యాంకర్స్ జడ్జెస్ గురించి తమ అభిప్రాయాన్ని వివరించాలని ఇంటర్వ్యూ అడగగా.. ర‌ష్మీ గురించి మాట్లాడుతూ అప్పటి వరకు ఉన్న యాంకర్ స్థాయిని మించిన యాంకర్ రష్మీ. ఆమె తెలుగు రాకపోయినా కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఆమె తెలుగుని తెగులు అన్న కూడా అందరు నవ్వుకుంటారు.. ఆ రేంజ్ లో త‌న స్లాంగ్‌తో ప్రేక్షకులను అలరించింది అంటూ వివరించాడు. అనూష గురించి మాట్లాడుతూ ఆమె యాంకర్ గానే కాదు నటిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆమెకు యాంకరింగ్ తో పాటు సినిమాలు బాగా సెట్ అయ్యాయి అంటూ వివరించాడు. ఇలా జ‌బ‌ర్ద‌స్త్‌లో కమెడియన్స్ గా ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ఒక టాగ్ ఇచ్చాడు. సుదీర్ మల్టీ టాలెంటెడ్, గెటప్ శీను కమల్ హాసన్, రాంప్ర‌సాద్‌ ఆటో డైలాగ్స్ కి ఫేమస్ అంటూ ప్రతి ఒక్కరి ప్రత్యేకతలను కిరాక్ ఆర్పి చెప్పుకొచ్చాడు.