ప్లాబ్ బీ స్టార్ట్ చేసిన శ్రీలీల.. కన్నడ పిల్ల తెలివి తెల్లారిపోతుందిగా..!

శ్రీ లీల ..ప్లాన్ బి స్టార్ట్ చేసిందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . సోషల్ మీడియాలో హాట్ హాట్ ..ట్రెండీ ఫొటోస్ షేర్ చేసిన శ్రీ లీల ఇప్పుడు రూట్ మార్చేసింది . బుంగమూతి పెట్టుకొని .. నంగనాచి చూపులు చూస్తూ బాధగా ఉన్న ఫొటోస్ ను రీసెంట్గా షేర్ చేసింది శ్రీలీల . దీంతో తాను ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అని చెప్పకనే చెప్పేస్తుంది శ్రీలీల అంటున్నారు అభిమానులు .

అంతేకాదు ఎప్పుడు సరదాగా చూసే శ్రీలీల ఫేస్ ఇంత దీనంగా చూడడానికి జనాలు ఇష్టపడడం లేదు . శ్రీ లీల ఖాతాలో ఇప్పుడు సినిమాలు లేవు.. ఇప్పుడు ఉన్న సినిమాలు అన్నీ కూడా గతంలో కమిట్ అయిన మూవీస్ కావడం గమనార్హం. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అని చెప్పడానికి మరో ఎగ్జాంపుల్ గా ప్రూవ్ చేసుకుంది శ్రీ లీల. గతంలో శ్రీ లీల పేరు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోయేదో మనకు తెలిసిందే.

ఇప్పుడు మాత్రం ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం ఆమె నటించిన సినిమాలు డిజాస్టర్ గా మారడం. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు శ్రీ లీల సాడ్ ఫోటోషూట్ వైరల్ గా మారింది . దీంతో ప్లాన్ బి స్టార్ట్ చేసింది అని ..సింపతితో ఆఫర్స్ దక్కించుకోవడానికి ట్రై చేస్తుంది అంటున్నారు కొందరు ఆకతాయిలు. శ్రీ లీల లాస్ట్ గా నటించిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమా టైంలో ఆమె ఎంత ట్రోలింగ్కి గురైందో మనకు తెలిసిందే . ఆ తర్వాత ఆమె కొత్తగా సినిమాలకి కమిట్ కాలేదు . చూద్దాం మరి శ్రీ లీల టైం ఎప్పుడు మారుతుందో..??