“నాతో ఆ పని చేయడానికి ఆయన ఒప్పుకోలేదు”.. ఇన్నాళ్లకు ఆ విషయాని బయట పెట్టిన శృతి హాసన్..!!

శృతిహాసన్ .. సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ బ్యూటీ . బోల్డ్ అంటే కాదు ..స్టార్ అయినప్పటికీ సోషల్ మీడియాలో నిరంతరం హాట్ టాపిక్ గా ట్రెండింగ్ లో నిలిచే బ్యూటీ. ఎలాంటి బోల్డ్ పాత్రనైనా ఎలాంటి బోల్డ్ పదాలనైనా అవలీలగా మాట్లాడేసే బ్యూటీ .. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. అమ్మడు అంటే కొందరు హీరోలు కూడా గజగజ వణికి పోతారు . దానికి కారణం ఆమె ఉన్నది ఉన్నట్లు మోహన నిక్కచ్చిగా మాట్లాడడమే.

“వీర సింహారెడ్డి” మూవీతో తెలుగు ప్రేక్షకులను చాలా కాలం తర్వాత పలకరించిన శృతిహాసన్.. ఆ తర్వాత వాల్తేరు వీరయ్య – హాయ్ నాన్న – సలార్ సినిమాలతో సూపర్ డూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. ప్రజెంట్ సలార్ 2.. హాలీవుడ్ ఫిలిం లో బిజీబిజీగా ఉన్న శృతిహాసన్ .. తాజాగా లియో మూవీ డైరెక్టర్ లోకేష్ కనకరాజు తో కలిసి “ఇన్మోల్” మ్యూజిక్ ఆల్బమ్ లో నటించింది. దీనికి సంబంధించిన పిక్చర్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఈ ఆల్బమ్ గురించి శృతిహాసన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది . “ఇన్మోల్ మ్యూజిక్ ఆల్బమ్ గురించి లోకేష్ నాతో సంప్రదించినప్పుడు మొదట ఆయన ఇందులో నటించేందుకు నిరాకరించాడు .. ఒప్పుకోనే ఒప్పుకోలేదు.. ఆ తర్వాత చాలామంది రిక్వెస్ట్ చేయగా .. ఈ కాన్సెప్ట్ విని అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ చెప్పుకొచ్చింది . శృతిహాసన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగా బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ తనదైన స్టైల్ లో పలు సినిమాల్లో నటించింది ..క్రేజీ క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ .