మహేష్ బాబు – మణిరత్నం కాంబోలో మిస్ అయిన సినిమాల లిస్ట్ ఇదే.. అవేంటంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ నటవరసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాడు మహేష్ బాబు. రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. చివరిగా వచ్చిన గుంటూరు కారం సినిమా వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ప్రస్తుతం రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు మహేష్. ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో మహేష్ బాబు కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక‌టి వైరల్ గా మారింది.

మహేష్ బాబు – తమిళ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో ఇప్పటికి మూడు సినిమాలు మిస్సయ్యాయట. ఇంతకీ ఆ మూడు సినిమాలు ఏంటి.. అవి మహేష్ బాబు చేయకపోవడానికి కారణాలేంటి.. ఒకసారి చూద్దాం. మణిరత్నం డైరెక్షన్‌లో మహేష్ బాబుకు మూడు సినిమాల్లో నటించే అవకాశం బ‌చ్చిందట. అయితే మూడింటిని మహేష్ రిజెక్ట్ చేశాడు. అలా మణిర‌త్నం డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా సఖి సినిమా తీయాల‌ని చూశారు. కానీ అప్పటికే మహేష్ బాబు సినిమాకు కమిట్ అవ్వ‌డం.. డేట్స్ ఖాళీ లేకపోవడంతో సఖి సినిమాను తమిళ్ హీరో మాధవన్ నటించిన మెప్పించాడు.

ఈ సినిమా తరువాత ఓకే బంగారం సినిమాకి కూడా మొదట మహేష్ బాబుతో చేయాలని ప్లాన్ చేశాడట మణిర‌త్నం. అయితే అప్పటి మహేష్ బాబు ఇమేజ్‌కు త‌గ్గ స్టోరీలా లేదని ఉద్దేశంతో మరోసారి మహేష్ ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు. ఇక చివరిగా మణిరత్నం డైరెక్షన్లో తెరకెక్కిన పొనియన్ సెల్వ‌న్ సినిమాలోను మహేష్ బాబుకు డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించే అవకాశం వచ్చిందట. మణిరత్నం ఈ క్యారెక్టర్ కోసం మహేష్ బాబును ఎలాగైనా నటింపజేయాలని ప్రయత్నించారట. కానీ మహేష్ ఈ సినిమాను కూడా రిజెక్ట్ చేశాడు. ఇలా మహేష్ బాబుకు.. మణిరత్నం మూడుసార్లు సినిమా ఛాన్స్ ఇచ్చినప్పటికీ మూడుసార్లు ఆ సినిమాను రిజెక్ట్ చేశాడంటూ న్యూస్ నెట్టింట తెగ వైరల్ గా మారింది.