“నేను లైఫ్ లో చేసిన బిగ్ తప్పు అదే.. నన్ను క్షమించండి”..తెలుగు డైరెక్టర్ షాకింగ్ ట్వీట్..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్స్ కూడా పలు సంచలన విషయాలను ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ఇప్పటికే అలాంటివి మనం ఎన్నో చూసాం . రీసెంట్గా డైరెక్టర్ కృష్ణవంశీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . ఇప్పుడంటే పెద్దగా క్రేజ్ లేదు కానీ.. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన తెరకెక్కించిన సినిమాలు ఎంత హిట్ అయ్యాయి అన్న విషయం అందరికీ తెలిసిందే.

పలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు . కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో లెజెండ్ డైరెక్టర్గా క్రేజ్ సంపాదించుకున్న కృష్ణవంశీ తెరకెక్కించిన శ్రీ ఆంజనేయం సినిమా ఫ్లాప్ అయిన విషయం అందరికీ తెలిసిందే . ఇటీవల ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇదే మూమెంట్లో పలువురు జనాలు కూడా శ్రీ ఆంజనేయం బాగుంది అంటూ నెట్టింట పోస్టులు పెట్టారు . దానికి కృష్ణవంశీ కూడా స్పందించారు .

అయితే తాజాగా మరోసారి ఓ నెటిజన్ చేసిన పోస్ట్ కు కృష్ణవంశీ స్పందించారు . ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు . “శ్రీ ఆంజనేయం సినిమా అంతా వేరే లెవెల్ లో ఉంది ..కాన్సెప్ట్ కూడా సూపర్ గా ఉంది . కానీ నితిన్ – ఛార్మి మధ్య రొమాంటిక్ సాంగ్ ఎందుకు పెట్టారో ..? అర్థం కాలేదు అంటూ పోస్ట్ పెట్టాడు”. దానికి కృష్ణవంశీ అన్సర్ ఇస్తూ..”అసలు ఆ పాట పెట్టడానికి కారణం నేనే .. ఆ పాటని అలా పెట్టాను.. తప్పు నాదే మీతో ఏకీభవిస్తున్నాను .. ఆ విషయంలో ఇప్పటికి బాధపడుతున్నాను క్షమించండి” అంటూ రాసుకు వచ్చాడు . ఇది చూసిన నెటిజన్స్ కృష్ణవంశీ సింప్లిసిటీకి ఫిదా అయిపోతున్నారు..!!