ఇప్పటివరకు శ్రీ లీల నటించిన అన్ని సినిమాలలోనూ ఆ పని చేసింది..ఆ ఒక్క మూవీలో తప్పిస్తే.. మీరు గమనించారా..!

శ్రీ లీల.. పేరుకి కన్నడ బ్యూటీనే .. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ . చాలా చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తనకంటే వయసులో డబల్ – ట్రిపుల్ ఏజ్ గల హీరోలతో కూడా నటించింది ..మెప్పించింది . రొమాన్స్ కూడా చేసి అదరహో అనిపించింది . శ్రీ లీల ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్ని గమనిస్తే అన్ని సినిమాలలో రొమాన్స్ చేసింది . ఘాటైన పర్ఫామెన్స్ ఇచ్చింది .

కేవలం బాలకృష్ణ సినిమాలో మాత్రమే ఆమె ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించింది . బాలకృష్ణ కూతురుగా ఆమె నటించిన సినిమా భగవంత్ కేసరి . ఈ సినిమాలో మాత్రమే రొమాంటిక్ టచ్ లేకుండా పద్ధతిగా నటించింది . ఇక మిగతా మూవీస్ లో ఆమె నటించిన ప్రతి సినిమాలలోనూ అరాకొరా రొమాన్స్ చేసింది . కొన్ని సినిమాల్లల్లో కొన్ని సీన్స్ లో హద్దులు మీరి పోయింది . ఈ విషయాన్ని అభిమానులు బాగా కనిపెట్టేశారు.

అదే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు . ప్రెసెంట్ పలు సినిమాలతో బిజీగా ముందుకు వెళుతుంది శ్రీ లీల . అంతకంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆమె కొత్తగా ఏ సినిమాకి కమిట్ అవ్వడం లేదు.. ఇవన్నీ కూడా గతంలో అప్పుడో ఎప్పుడో కమిట్ అయిన మూవీస్ కావడం. దీంతో కొందరు శ్రీ లీల కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అంటూ ట్రోల్ చేస్తుంటే ..మరి కొందరు పాప బొక్క బోర్లా పడింది అంటూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి శ్రీ లీల ఏదో అనుకోని ఏదో చేయబోయి ఇంకేదో చేసేసి అటు ఇటు కాకుండా మిగిలిపోయింది . చూద్దాం ఇలాంటి ట్రోలింగ్ నుంచి శ్రీ లీల ఎలా బయటపడుతుందో తన కెరీర్ ని ఎలా చక్కదిద్దుకుంటుందో..???