ఛీ..ఛీ.. ఆఖరికి దాన్ని కూడా కాపీ కొట్టారా?.. గంగలో కలిసిపోయిన అంబానీ కోడలు పరువు..!

ప్రముఖ బిజినెస్ మాన్ ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ మరియు రాధికాల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఎంతో అంగరంగ వైభోగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి ఇంకా నాలుగు నెలలు సమయం ఉండగానే ఈ వేడుకలు జరిపించడం మొదలుపెట్టాడు ముఖేష్ అంబానీ. తన కొడుకు పెళ్లి దేశంలోనే రిచెస్ట్ పెళ్లిగా నిలవాలని డబ్బు గురించి అస్సలు పట్టించుకోవడం లేదు ముఖేష్ అంబానీ.

ఇక ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ లోని జామ్ నగర్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు రోజుల పాటు ఈ సంబరాలు జరగనున్నాయి. ఇక ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీస్ మరియు ఇతర వ్యాపార రంగాలకు చెందినవారు హాజరయ్యారు. అదేవిధంగా ఈ సెలబ్రేషన్స్ లో కొందరు బాలీవుడ్ హీరోలు డాన్స్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇక అనంత్ అంబానీ మరియు రాధిక ఈ వేడుకలో కొంత స్పీచ్ కూడా ఇచ్చారు. ఈ స్పీచ్ కి ముఖేష్ అంబానీ కంటతడి పెట్టాడు కూడా. తన కుమారుడు చేసిన వ్యాఖ్యలకి వాపోయాడు ముఖేష్ అంబానీ.

ఇక తాజాగా ముఖేష్ అంబానీ కోడలు రాధిక చేసిన స్పీచ్ పై కొన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి. అసలు విషయంలోకి వెళితే.. రాధిక తన ప్రీ వెడ్డింగ్ వేడుకలలో మాట్లాడిన స్పీచ్ అంతా కాపీ కొట్టినట్లు ఓ వీడియో వైరల్ అవుతుంది. ఓ హాలీవుడ్ సినిమా డైలాగ్స్ కాపీ కొట్టి తన ప్రీ వెడ్డింగ్ లో చెప్పినట్లు గుర్తించారు ప్రేక్షకులు. ఓ హాలీవుడ్ సినిమాలో చెప్పిన డైలాగ్స్ ను యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసి బాగా బట్టీ పట్టి స్టేజ్ పై చెప్పింది రాధిక. దీంతో.. ఆఖరికి వీటిని కూడా కాపీ కొడుతున్నారా.. ఎమోషన్స్ అనేవి లోపల నుంచి రావాలి. అంతేకానీ సినిమాలో వాటిని వాడకూడదు.. అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Sadiq Saleem (@sadiqidas)