పుష్ప మూవీ కేశవ పై నటి శరణ్య సంచలన కామెంట్స్.. అతను క్యారెక్టర్ అదేనంటూ..!!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ శరణ్య ప్రదీప్ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్‌తో దూసుకుపోతుంది. ఫిదా సినిమాలో సాయి పల్లవి అక్కగా నటించిన ఈ ముద్దుగుమ్మ.. భామ కలాపం సిరీస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లో కీలకపాత్రలో నటిస్తూ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల సుహాస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాల్లో ఓ కీలకపాత్రను పోషించింది. ఈ సినిమాలో ఆమె న‌ట‌న‌కు ఎంతోమంది ప్రశంసలు దక్కాయి. ఇక ఈ మూవీలో సుహాస్ సోదరి పాత్రలో శరణ్య మెప్పించింది. ఈ మూవీలో శరణ్య నటనకు ప్రాధాన్యత ఉన్న పవర్ఫుల్ రోల్‌లో మెప్పించింది. నటనతో మెప్పించడమే కాదు.. అందరినీ ఆశ్చర్యపరిచింది కూడా. శరణ్య ఈ మూవీలో న్యూడ్ గా నటించాల్సిన స‌న్నివేశంలో కూడా నటించింది.

దీంతో అంత ఆశ్చర్యపోయారు. తన భర్త ప్రోత్సాహంతోనే ఆ సన్నివేశాన్ని నటించగలిగాను అంటూ ఇంటర్వ్యూలో వివరించింది శ‌ర‌ణ్య‌. ఇక ఈ మూవీలో పుష్ప ఫేమ్ జగదీష్ (కేశవ) ఓ కీలక పాత్రలో నటించాడు జగదీష్. శరణ్య ప్రియుడుగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఎమోషన్స్ కూడా బాగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ‌రణ్య‌ మాట్లాడుతూ జగదీష్ కేసు పై స్పందించింది. ఇటీవల జగదీష్ ఓ మహిళను ప్రైవేట్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి ఆమె ఆత్మహ‌త్య‌కు కారణం అయ్యాడు. ఆ కేసులో జగదీష్ జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జగదీష్ బెయిల్ పై విడుదలై సినిమా షూటింగ్లలో బిజీ అయ్యాడు.

ఇక ఓ ఇంటర్వ్యూలో శ‌ర‌ణ్య‌ మాట్లాడుతూ జగదీష్ కేసు గురించి ప్రశ్నించగా ఆసక్తికర సమాధానాలు వెల్లడించింది. అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. తెలియకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు. పుష్ప సినిమాలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న జగదీష్ ఇలాంటి ఇబ్బందులను ఫేస్ చేయడం నిజంగానే బాధాకరం. అయితే మా సినిమా సెట్ లో మాత్రం జగదీష్ మా అందరితో చాలా గౌర‌వంగా ఉండేవారు. నాతో పాటు నా చుట్టుపక్కల వాళ్ళని కూడా ఆయన గౌరవిస్తూనే పలకరించాడు. చాలా ఒదిగి ఉండే తత్వం. మాతో పాటు కలిసి కింద కూర్చుని భోజనం చేశాడు. నేను చూసినంతవరకు అయితే అతని క్యారెక్టర్ లో ఎలాంటి చెడు లేదు. కానీ అతడు కేసు విషయంలో ఏం జరిగిందో మనం చూడలేదు.. కాబట్టి దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ శరణ్య వివరించింది.