చిన్నప్పటి నుంచి నాకు ఆ స్టార్ హీరోతో అలా చేయాలని కోరిక… సిగ్గును పక్కన పెట్టి మనసులో ఉన్న కోరికను బయటపెట్టిన శ్రద్ధా కపూర్..!

శ్రద్ధా కపూర్.. పేరుకి బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ అంద చందాలకు తెలుగు ప్రేక్షకులు బేభత్సంగా ఎడిట్ అయిపోయారు. అదేవిధంగా ఆషికి 2 మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ అప్పటినుంచి ఇప్పటివరకు వరుస హ్యాట్రిక్లను అందుకుంటు దూసుకుపోతుంది.

ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లు దాటుతున్న ఇప్పటికి కూడా తన గ్లామర్ డోస్ ఏ మాత్రం తగ్గించడం లేదు. ఇక మన ఇండస్ట్రీలో కలిసి చదువుకున్న స్నేహితులు ఎందరో ఉన్నారు. వారిలో శ్రద్ధ మరియు వరుణ్ ధావన్ ఒకరు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఒకే స్కూల్లో చదువుకున్నారు కూడా. అలా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇక ఆ మధ్యకాలంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు అనేక పుకార్లు వెదజల్లాయి కూడా.

కానీ వరుణ్ తన స్నేహితురాలు నటాషా దలాల్ పెళ్లి చేసుకోవడంతో ఈ పుకార్లకు తెరపడింది. ఇక ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధ.. వరుణ్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ..” చిన్నప్పటి నుంచి వరుణ్ నా బెస్ట్ ఫ్రెండ్. అతన్ని బాగా ఇష్టపడేదాన్ని. ఓ రోజు నేరుగా తనకు ప్రపోజ్ చేశాను. వెంటనే ఆశ్చర్యపోయాడు. అప్పుడు నా వయసు జస్ట్ ఎనిమిదేళ్లు ఐ లవ్ యు అనగానే వరుణ్ కు ఏం చేయాలో తెలియక నో అని చెప్పాడు ” అంటూ వ్యాఖ్యలు చేసింది శ్రద్ధ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.