విశ్వక్సేన్ ” గామి ” 2 డేస్ కలెక్షన్స్.. మనోడు కష్టాలు ఫలించాయిగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో విశ్వక్సేన్ కూడా ఒకరు. తనకి నచ్చిన రీతిలో కథలను ఎంచుకుంటూ మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు విశ్వక్సేన్. ఇక తాజాగా విశ్వక్సేన్ హీరోగా నటించిన మూవీ ” గామి “.

భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. చాందిని చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో అభినయ తదితరులు కీలకపాత్రను వహించారు. ఇక ఈ మూవీ కి విద్యాధర్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ మూవీ నేటితో రెండు రోజులు పూర్తి చేసుకుంది.

ఈ మూవీ రెండు రోజుల వసూళ్లను తాజాగా యూవీ క్రియేషన్స్ వారు ప్రకటించారు. ఈ రెండు రోజుల్లో పి ఆర్ నెంబర్స్ ప్రకారం మొత్తం 15.1 కోట్ల గ్రాస్ ని అందుకుని రెండో రోజు కూడా సుమారు 8 కోట్ల వరకు గ్రాస్ ని అందుకుని దూసుకుపోతుంది. ఇక ఈ ఆదివారం కూడా గామి మంచి బుకింగ్స్ ని నమోదు చేసినట్లు తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో ఈ మూవీ ఎంత మేరా కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.