‘ విశ్వంభర ‘లో చిరంజీవి, త్రిష రోల్స్ లో అసలు ట్విస్ట్ అదేనా.. నిజమైతే మాత్రం ఆ కిక్కే వేరు..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి.. బింబిసారా మూవీ ఫేమ్ వ‌శిష్ట‌ మల్లిడి డైరెక్షన్లో విశ్వంభర సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. సోషియా ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్లో రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఆమెతో పాటు మరి కొంతమంది స్టార్ కాస్టింగ్ కూడా ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారంటూ ఎప్పటినుంచో వార్తలు వైరులైన సంగతి తెలిసిందే.

ఆయన పాత్రలో రెండు రకాల షేడ్స్‌ ఉంటాయట. అంతేకాదు ఆయనకు జంట‌గా న‌టిస్తున్న త్రిషది కూడా ఈ సినిమాలో డ్యూయల్ రోల్ అని.. ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె కూడా రెండు పాత్రల్లో డిఫరెంట్ షేడ్‌స్‌లో కనిపించనుందట. ఫాంటసీ ఎలిమెంట్లలో ఓ గెటప్‌లో, సోషల్ ఎలిమెంట్లలో మరో గెటప్ లో త్రిష కనిపిస్తుందని సమాచారం. ఇందులో నిజం ఎంత ఉందో అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే గాని తెలియదు. ఇక ఈ సినిమాలో త్రిష తో పాటు ఆయనకు చెల్లెళ్ళుగా ఐదుగురు టాలీవుడ్ హీరోయిన్స్ కనిపించబోతున్నారట.

వారిలో ఆశిక రంగనాథన్, సురభి, ఈషా చావ్లా సినిమా మొత్తం కనిపిస్తారట‌. మృణాల్‌ ఠాగూర్, మీనాక్షి చౌదరి అలిధి పాత్ర‌ల‌లో మెరుస్తారని సమాచారం. అలాగే యంగ్ హీరో రాజ్ తరుణ్, నవీన్ చంద్రలు కూడా కీలకపాత్రల్లో నటించనున్నారట. ఇలా ఇప్పటికే ఎంతోమంది స్టార్ కాస్ట్ ఈ సినిమాలో యాడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీని రెండు వందల కోట్ల భారీ బడ్జెట్‌లో యూవి క్రియేషన్స్ బ్యానర్ రూపొందిస్తుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ సర్వే గంగా జరుగుతుంది. ఇక ఇటీవల ఈ సినిమాలో ఓ సాంగ్ షూట్ పూర్తయిందట. ఇక ప్రస్తుతం మరో షెడ్యూల్ కోసం మూవీ టీమ్స్ సిద్ధమవుతున్నారు.