పెళ్లికి ముందు ఆ కండిషన్ పెట్టి ప్రేమించుకున్న సమంత .. అదే కండిషన్ పెట్టి నాగచైతన్యతో విడాకులు తీసుకుందా..?

సమంత – నాగచైతన్య ఇండస్ట్రీలో ఒకప్పుడు లవబుల్ కపుల్.. రొమాంటిక్ కపుల్.. సెక్సీ పెయిర్.. ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో . పలు ట్యాగ్స్ తో అప్పట్లో సోషల్ మీడియాని సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేసారు. ఏం మాయ చేసావే సినిమాతో క్రేజీ కపుల్ గా మారిపోయిన ఈ జంట . ఆ తర్వాత నిజజీవితంలో కూడా భార్యాభర్తలు గా మారి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.


అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ జంట సడన్గా విడాకులు తీసుకోవడానికి డిసైడ్ అయ్యారు . ఆరు నెలల పాటు వీళ్ళ విడాకుల మేటర్ సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ గా మారింది . ఆ తర్వాత నిజంగానే ఈ జంట విడాకులు తీసుకున్నారు. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో వీళ్ళు విడాకులు తీసుకున్న విషయాన్ని మరోసారి ట్రోలింగ్ చేస్తున్నారు . గతంలో హీరోయిన్ సమంత “మన మధ్య ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే విడాకులు అన్న పదం ఎత్తకూడదు ” అంటూ కండిషన్ పెట్టింది అన్న వార్త బాగా వైరల్ అయింది .

అయితే ఒకానొక ఇంటర్వ్యూలో ..”నేనే చైతన్యను విడాకులు అడిగాను అంటూ సమంత ఓపెన్ గా చెప్పుకొచ్చింది”. ఆమె పెట్టిన కండిషన్ ఆమె బ్రేక్ చేసింది ..అంటే సమంత మాట మీద నిలబడే టైప్ కాదు అంటూ అప్పట్లో హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేశారు జనాలు . ఈ విషయం కారణంగా మరోసారి సమంత ప్రాబ్లంలు ఫేస్ చేస్తుంది. ఎవరి సైడ్ నుంచి తప్పు ఉందో తెలియదు కానీ ఇద్దరు కూడా విడాకులు తీసుకొని హ్యాపీగానే ఉండడం గమనార్హం..!!