సుద్దపూస కుర్రాడా మజాకా.. సినిమా షూట్ కి అటెండ్ అవ్వాలి అంటే అది ఉండాల్సిందే.. పాన్ ఇండియా స్టార్స్ నే మించిపోయావుగా..!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో రోహన్ రాయ్ పేరు ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనం చూస్తున్నాం. రోహన్ రాయ్ .. ఈ పేరు చెప్తే గుర్తుపట్టే వాళ్ళు చాలా చాలా తక్కువ . అదే సుద్దపూసని కుర్రాడు.. అంటే మాత్రం పక పక నవ్వేస్తారు . ఓ రేంజ్ లో అరుపులు వినిపిస్తాయి . అంతలా ఓ పాన్ ఇండియా స్టార్ కి మించిన రేంజ్ లో దూసుకుపోతున్నాడు ఈ బుడ్డోడు .

రీసెంట్ గా వచ్చిన 90’స్ వెబ్ సిరీస్ తో బాగా పాపులారిటీ దక్కించుకున్న ఈ రోహన్ రాయ్ రేంజ్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . 90 వెబ్ సిరీస్ లో నటించిన ఈ రోహన్ రాయ్ ఒక్కొక్క కాల్ షీట్ కి 30 వేలు డిమాండ్ చేస్తున్నారట . అంతేకాదు ఇది చాలా చాలా ఎక్కువ . బుడ్డోడికి ఇలాంటి రెమ్యూనరేషన్ అంటే ఇండస్ట్రీలోనే అది ఓ సంచలనం . అంతేకాదు ఈ బుడ్డోడు అడగాలి కానీ బెంగళూరు నుంచి స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ కి తీసుకొస్తున్నారట మూవీ మేకర్స్ .

ఇతగాడికి చాలా చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారట . దీంతో ఈ బుడ్డోడు కూడా టైం చూసి కొడుతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ప్రతిదీ కూడా ఈ బుడ్డోడు చాలా కొత్తగా డిమాండ్ చేస్తున్నాడట . స్పెషల్ కార్వాన్ కావాలి అంటూ కండిషన్స్ పెడుతున్నారట . అంతేకాదు కాల్ షీట్స్ టైం కూడా లిమిటెడ్ గా ఇస్తున్నారట. దీంతో సుద్ధ పూసని కుర్రాడు రేంజ్ మామూలుగా లేదుగా అంటున్నారు అభిమానులు..!!