ఆ హీరోయిన్ విషయంలో పెద్ద తప్పు చేసిన మహేష్ బాబు.. నమ్రత ఏం చేసిందంటే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాత తాలూకా విషయాలు మరోసారి నెట్టింట వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తున్నాం. ఒకటి కాదు రెండు కాదు సోషల్ మీడియాలో ఇలాంటివి బొచ్చా బోలెడు వార్తలు మనం వింటూనే ఉంటున్నాం. రీసెంట్గా సోషల్ మీడియాలో సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు సంబంధించిన ఒక వార్త నెట్టింట బాగా వైరల్ అవుతుంది.

మహేష్ బాబు చాలామంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు . కానీ ఆయనకు బాగా నచ్చిన హీరోయిన్ మాత్రం కాజల్ అంటూ ఇంటర్వ్యూలో చెప్పారు . కాజల్ చేత చీర కట్టించమని పూరి జగన్నాథ్ కు స్పెషల్ గా రిక్వెస్ట్ చేశాడట. బిజినెస్ మ్యాన్ సినిమాలో ఆమెతో హద్దులు మీరు పోయాడు . నిజం చెప్పాలంటే ఆ రేంజ్ లో ఏ హీరోయిన్ తో కూడా రొమాన్స్ చేయలేదు మహేష్ బాబు.

ఈ క్రమంలోనే అప్పుడు నమ్రత కూడా హర్ట్ అయింది అంటూ వార్తలు వినిపించాయి . మహేష్ బాబు అభిమానులు సైతం కాజల్ విషయంలో మహేష్ చేసింది తప్పు అంటూ తప్పుపట్టారు . అయితే అదంతా అబద్ధమని నమ్రత అలాంటివి పెద్దగా పట్టించుకోదు అని .. ఆమె ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా ఉండేది.. ఇలాంటి విషయాలు ఆమెకు బాగా తెలుసు అని .. ఘట్టమనేని ఫ్యాన్స్ క్లారిటీ ఇచ్చారు..!!