“ఒంటి మీద బట్టలు లేకుండా న్యూడ్ షో”..ఆస్కార్ అవార్డ్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా..ఎందుకంటే..?

సినీ లవర్స్ ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగింది . 96వ అకాడమీ అవార్డుల ప్రధాన ఉత్సవం లాస్ ఏంజెల్స్ లో ఎంతో అట్టహాసంగా చాలా అద్భుతంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ స్టార్స్ హాజరై సందడి చేశారు. నేడు తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన ఈ అవార్డ్స్ వేడుకలు రకరకాల క్యాటగిరి వాళ్లకి అవార్డ్స్ ఇచ్చారు .

ఇందులో బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డ్స్ అవార్డుని ఇచ్చే అవకాశం జాన్ సేనకు దక్కింది . ఈ జాన్ సేన ఎవరో కాదు స్టార్ రెజ్లర్ . ఈయన గురించి అందరికీ బాగా తెలిసిన విషయమే . 1998లో బాడీ బిల్డర్ గా కెరియర్ ప్రారంభించారు. ఆ తర్వాత WWW లో ఎన్నో మెడల్స్ సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. రీసెంట్గా ది మెరైన్ అనే సినిమాలోను నటించి మెప్పించాడు . కాగా ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో స్టార్ రెజ్లర్ జాన్ సేన కనిపించిన తీరు అందరికీ షాకింగ్ గా అనిపించింది .

ఈ అవార్డును ప్రజెంట్ చేయడానికి ఆయన ఒంటిమీద బట్టలు లేకుండా న్యూడ్ గా వచ్చాడు. దీంతో అక్కడున్న వాళ్ళు షాక్ అయిపోయారు . ఓంటి పై నూలు పోగు లేకుండా తన ప్రైవేట్ పార్ట్ కనిపించకుండా విన్నర్ పేరు ఒక బోర్డుని అడ్డుపెట్టుకొని దర్శనమిచ్చాడు . ఇది అక్కడ ఉండే వాళ్ళకి షాకింగ్ గా ఇబ్బందికరంగా ..అనిపించింది . ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొంతమంది ఇది చూసి తిడుతూ ఉంటే మరి కొంతమంది ఫన్నీగా నవ్వుకుంటున్నారు..!!