ఈ యంగ్ బ్యూటీలో అది అంత స్పెషలా.. బాలయ్యే పిలిచి మరి ఆఫర్ ఇచ్చాడుగా

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, కేఎస్ బాబి డైరెక్షన్లో ప్రస్తుతం బాలయ్య 109వ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్‌బీకె 109 రన్నింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై.. ఫార్చునర్ ఫర్ బ్యానర్ లో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. కాగా ఈ మూవీలో బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇక ఆమెతో పాటు ఈ సినిమాల్లో కలర్ ఫోటో మూవీతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి చాందిని చౌదరి.. లక్కీ ఆఫర్ కొట్టేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న చాందిని చౌదరి తన న‌టన‌తో ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది.

నందమూరి బాలకృష్ణ తాజా సినిమాలో చాందిని చౌదరి

అలాగే చాందిని నటనకు బాలకృష్ణ కూడా ఫిదా అయిపోయార‌ట‌. ఏరి కోరి మ‌రి బాలయ్య ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌కు చాందినినీ సెలెక్ట్ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య తో నటించే ఛాన్స్ దొరికితే చాలని చాలామంది హీరోయిన్స్ ఆశ పడుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే అలాంటి లక్కీ జాక్‌పాట్ చాందిని చౌదరి కొట్టేసింది. అయితే బాలయ్య తో నటించే ఛాన్స్ ఆమెకు దొరకడం త‌న‌ కెరీర్‌కు మంచి బూస్టప్‌ అవుతుందనటంలో సందేహం లేదు. ఇక ఇటీవల సోలో సినిమాల్లో రాణించిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే విశ్వక్ సేన్‌ గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాన్నుంది.

Chandini Chowdary Wiki, Biography, Dob, Age, Height, Weight, Affairs and  More

ఈ సినిమాలో కీలకపాత్రలో నటించినా చాందిని.. ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇది ఒక అడ్వెంచర్స్ జర్నీ అని.. సినిమా షూటింగ్ టైంలో నిజంగానే చాలా స్టంట్ లు చేయవలసి వచ్చిందని వివరించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో చాందిని నుంచి రాబోతున్న గామి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ తెలుగు అమ్మాయి మొదట షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ఆరంభించింది. ఆ తర్వాత వెండి తెరపై చిన్ని చిన్ని అవకాశాలు అందుకుంటూనే హీరోయిన్గా ఎదిగింది. తర్వాత స్టార్ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంది. ఇలాంటి క్రమంలో వరుస అవకాశాలు వస్తున్న సెలెక్టెడ్ గా సినిమాలను ఎంచుకుంటూ నటనతో తన సత్తా చాటుతుంది ఈ ముద్దుగుమ్మ.